AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోని ఈ క్షేత్రం వెరీవెరీ స్పెషల్.. ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలతో సహా 1008 లింగాల దర్శనం.. ఎక్కడంటే.

చిన్న అరుణాచలం.. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలతో పాటు ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను కలిగి ఉండటం వల్ల ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆలయ పుట్టలో ఉన్న నాగేంద్రుడు ఈ గర్భాలయంలోకి వచ్చి శివయ్య తో పాటు దర్శనం ఇస్తంది. ఈ రోజు ఈ క్షేత్ర విశిష్టతను గురించి తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 08, 2025 | 11:09 AM

Share
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం భద్రాచలం లోని పర్ణ శాల మార్గంలోని నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ఉంది ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. అరుణాచలంలో ఎలా గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న అష్టలింగాలను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు

1 / 7
ఇంద్ర లింగం,అగ్ని లింగం, యమ లింగం, నిరృతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగాలను ఎలా దర్శనం చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా ఈ అష్ట లింగాలను.. సహస్ర లింగాలతో పాటు వెలుగొందుతున్నాయి. భక్తులతో పూజలు అందుకుంటున్నాయి.

2 / 7
ఈ క్షేత్రం మరొక విశిష్టత ఏమిటంటే.. మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాల్లో శివయ్య స్వయంగా ఉద్భవించాడో.. అదే రూపంలో ఈ క్షేత్రంలో12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. అంతేకాదు ఒకే లింగం మీద సహస్ర లింగాలు దర్శనం ఇస్తాయి. ఒకే లింగంపై మొత్తం 1007 లింగాలు అంటే ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి.

3 / 7
సహస్ర లింగ దర్శనం ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రాలైన  కాశి క్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే జరుగుతుంది. స్పటిక లింగం పాన లింగం, మరకత లింగం వంటి లింగాలు దర్శనం అవుతాయి. శ్రీ చక్ర జ్యోతిలింగం, పాదరస లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనం ఇస్తూ భక్తుల ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది.

4 / 7
ఈ క్షేత్రం మరో విశిష్టత ఏమిటంటే 12 జ్యోతిర్లింగాలకు భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళలేని భక్తులు చిన్నఅరుణాచలం సందర్శిస్తే ఆ అనుభూతిని పొందవచ్చు అని అంటున్నారు.

5 / 7
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1008 బ్రహ్మ సూత్రాల లింగాలను ఒకే సారి దర్శనం చేసుకునే భాగ్యం ఉంది. అంతేకాదు లింగాలు రామేశ్వరంలోని స్పటిక లింగం జ్యోతిర్లింగం ఏ విధంగా దర్శనమిస్తుందో.. అదే విధంగా ఇక్కడ స్ఫటిక జ్యోతిర్లింగం భక్తులకు దర్శనమిస్తుంది. అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

6 / 7
ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మురుగన్ భారీ బంగారు రంగు విగ్రహం ఉంది. ఇక్కడ ఆలయంలో ఒక పెద్ద పుట్ట ఉంది. ప్రతి సోమవారం ఆ పుట్టలో ఉన్న నాగేంద్రుడు స్వయంగా గర్భాలయంలో రావడం విశేషం. పర్ణశాలకు వెళ్లే యాత్రికులకు నిత్యం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందిస్తుంది. గో శాల కూడా ఉంది.

7 / 7