- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti: you should never trust these five people in life
Chanakya Niti: ఈ అయిదుగురు వ్యక్తులను నమ్మితే.. నట్టేట ముంచేస్తారు.. తస్మాత్ జాగ్రత్త
ఆచార్య చాణక్య మన జీవితాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. నాటి నుంచి నేటి వరకూ అవి అనుసరణీయం. వాటిలో స్నేహం, వైవాహిక జీవితం , విజయవంతమైన జీవితం ఉన్నాయి. అదేవిధంగా మనం ఎవరితో సహవాసం చేయకూడదు? ఎలాంటి వ్యక్తులను నమ్మకూడదో కూడా తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఈ రోజు ఆచార్య చాణక్య చెప్పినట్లుగా జీవితంలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకుందాం..
Updated on: Sep 09, 2025 | 11:16 AM

స్నేహం అయినా, వివాహం అయినా, వ్యాపారం అయినా, జీవితంలోని ప్రతి బంధంలోనూ, అంశంలోనూ నమ్మకం చాలా ముఖ్యం. సంబంధాలు నమ్మకం ఆధారంగానే నిర్మించబడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఆచార్య చాణక్యుడు కొంతమందిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని, వారు మీ నమ్మకానికి అర్హులు కాదని చెబుతున్నాడు. చాణక్యుడు చెప్పినట్లుగా జీవితంలో ఎవరిని నమ్మకూడదు? ఎవరి నుంచి దూరంగా ఉండటం మంచిది తెలుసుకోండి.. ఈ ఐదుగురు వ్యక్తులు నమ్మదగినవారు కాదు

అబద్ధాలు చెప్పేవారు: ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పే వారితో స్నేహం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పేవారితో స్నేహం, సంబంధం స్థిరంగా ఉండదు. ఈ వ్యక్తులు తమ స్వలాభం కోసం చాలా సులభంగా అబద్ధాలు చెప్పగలరు. అవరం అయితే తమని నమ్మిన స్నేహితులను మోసం చేసే అవకాశం ఉంది. కనుక అబద్దాలు చెప్పే వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి.

మాట తప్పేవారు: ఎప్పుడూ మాట తప్పేవారు, స్థిరమైన ఆలోచనలు లేనివారు ఎప్పటికీ నమ్మదగిన వ్యక్తులు కారని చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి వ్యక్తులు తమ సౌకర్యాన్ని బట్టి మాట మార్చుకుని ద్రోహం చేస్తారు. కనుక వీరు నమ్మకానికి అర్హులు కారు.

అసూయపడే వ్యక్తులు: మీ అదృష్టం, విజయం చూసి అసూయపడేవారు, మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించే వ్యక్తులు మీ నమ్మకానికి ఎప్పటికీ అర్హులు కాదు. అలాంటి వ్యక్తులు అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని దిగజార్చడానికి లేదా మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తారు. వారు మీ మంచి కంటే చెడునే కోరుకుంటారు. కనుక వీలైనంత వరకు అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి.

మీ భావాలను గౌరవించని వ్యక్తులు: మీకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వని, మిమ్మల్ని గౌరవించని, మీ నమ్మకానికి అర్హులు కాని వ్యక్తులు. ఎందుకంటే వారికి మీ విలువ తెలియదు. వారి స్వార్థ కారణాల వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కనుక మీ కృషి, ప్రేమ, అంకితభావాన్ని ఎల్లప్పుడూ గౌరవించే వ్యక్తులతో స్నేహం చేయండి.

స్వార్థపరులు: చాణక్యుడు స్వార్థపరులకు దూరంగా ఉండటం ఉత్తమమని చెప్పాడు. అలాంటి స్వార్థపరులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారు ఎప్పుడూ మీ భావాలను గౌరవించరు. మీ స్నేహాన్ని తమ సొంత ప్రయోజనం కోసం వాడుకుంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరు. కనుక మీ నమ్మకానికి ఎప్పుడూ అర్హులు కారు. మీ జీవితంలో ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులు ఉంటే, వీలైనంత వరకు వారికి దూరంగా ఉండండి.




