- Telugu News Photo Gallery Spiritual photos Budhaditya Yoga: These zodiac signs to have adhikara and aadhaya vridhi yogas
Telugu Astrology: బుధాదిత్య యోగం.. ఈ రాశుల వారికి అధికారం, ఆదాయ వృద్ధి..!
జ్యోతిషశాస్త్రంలో బుధాదిత్య యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అధికార యోగానికి, ఆదాయ వృద్ధికి సంబంధించిన ఈ యోగం ఇతర రాశులలో కంటే రవికి చెందిన సింహ రాశిలోనూ, బుధుడికి చెందిన మిథున, కన్యారాశుల్లో రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఈ నెల 16న రవి, బుధ గ్రహాలు ఏకకాలంలో కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. కన్యారాశి బుధుడికి స్వక్షేత్రం, ఉచ్ఛ క్షేత్రం అయినందువల్ల రవి, బుధుల యుతితో ఏర్పడే బుధాదిత్య యోగం కొన్ని రాశులకు మహాయోగాన్నిస్తుంది. అక్టోబర్ 2వ తేదీ వరకూ కొనసాగే ఈ విశిష్టమైన యోగం వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనూ రాశుల వారికి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది.
Updated on: Sep 09, 2025 | 7:58 PM

వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో రవితో బుధుడు కలవడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు వీరి సలహాలు సూచనల వల్ల బాగా లబ్ధి పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఎటువంటి వ్యక్తిగత సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి.

మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు చేపట్టడం జరుగుతుంది. కుటుంబ జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సర్వత్రా గుర్తింపు లభిస్తుంది.

సింహం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో వీరి సలహాలు, సూచనలతో అధికారులు బాగా లబ్ధి పొందుతారు.

కన్య: ఈ రాశిలో రాశినాథుడు బుధుడితో రవి గ్రహం కలవడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా తప్పకుండా అధికార యోగం పడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.

వృశ్చికం: ఈ రాశివారికి లాభస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశిం చిన పురోగతితో పాటు ఆదాయపరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఏ పని తల పెట్టినా విజయవంతం అవుతుంది. సోదరులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగంతో పాటు ధర్మ కర్మాధిప యోగం కూడా కలుగుతోంది. దీనివల్ల ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ లో భాగం కావడం జరుగుతుంది. ఎటువంటి వ్యక్తిగత సమస్యలైనా సునాయాసంగా పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అయి విలువైన ఆస్తి లభిస్తుంది.



