AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాముకు రెండు నాలుకలు ఎందుకుంటాయి.. వీటి వెనకున్న కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

పాములంటే చాలా మందికి వణకు పుడుతుంది. వాటిని చూడటానికే భయపడి పోతుంటారు. కానీ కొంత మంది పాములంటే ఎంత భయం ఉన్నా వాటిని దగ్గరగా చూస్తూ, వీడియోస్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇక వీటి గురించి ఎన్నోసినిమాలు తెరపైకి రాగా, ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే మరోసారి పాములకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే పాముకు రెండు నాలుకలు ఉంటాయి. అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉన్నదని చెబుతున్నారు పండితులు. కాగా దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 09, 2025 | 11:18 AM

Share
కశ్యపుడు ప్రతి ఒక్కరికీ తెలుసు,ఈయనను వాల్మీకి రామాయణం ప్రకారం, బ్రహ్మ కుమారుడు అంటారు. ఇక ఈయనకు 21 మంది భార్యలు. వారిపేర్లలోకి వెళితే, దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల , తామ్ర, వశ, ముని మొదలైన వారు దక్షుని కుమార్తెలు.

1 / 5
అయితే కశ్యపునికి కద్రువ వలన నాగులు జన్మించగా, వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మిస్తారు.  అయితే వినత అంటే కద్రువకు అస్సలు పడకపోయేదంట. ఎప్పుడూ తనపై పగను పెంచుకునేదంట. దీంతో ఒక రోజు వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లగా, అక్కడ కద్రువ తెలివిగా ఒక పందెం కాస్తుంది. అందులో నువ్వు ఓడిపోతే నాకు జీవితాంతం దాస్యం చేయాలని చెబుతుంది వినతకు. దీంతో వినత కూడా ఈ  పందెంకు ఒప్పుకుంటుంది.

2 / 5
అయితే వీరికి అప్పుడే దూరంగా ఓ గుర్రం కనిపిస్తుంది. దాని తోక నల్లగా ఉందని, కద్రువ, వినతకు చెబుతుంది. కానీ అది అబద్ధం అంటూ అక్కడ ఉన్న గుర్రానికి నల్లటి తోకలేదు అని గట్టిగా వాదిస్తుంది వినత. దీంతో ఇద్దరం అక్కడికి వెళ్లి చూద్దాం, తోక నల్లగా ఉంటే నేను గెలిచినట్లు, నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. దానికి మరోసారి వినత సరే అని సమాధానం చెబుతుంది.

3 / 5
ఈ క్రమంలోనే కద్రువ తన తెలివిని ఉపయోగించి, మనసులో తన కుమారుడైన తక్షకుడిని మనసులో వేడుకుంటుంది. నువ్వు వెళ్లి గుర్రం తోక దగ్గర ఉండాలని చెబుతుంది. తక్షకుడు నల్లటి పాము, దీంతో తక్షకుడు వెళ్లి గుర్రం తోక భాగంలో నల్లటి తోకలా మారతాడు, అలా వినత ఓడిపోయి సేవలు చేస్తుంది. కానీ ఇది నచ్చని వినత కుమారుడు గరత్మంతుడు, తన తల్లి దాస్యం పొగొట్టడానికి ఏం చేయాలి అంటూ తన పిన్ని అయినా కద్రువను వేడుకుంటాడు, అప్పుుడ కద్రువ దేవతల నుంచి అమృతం తీసుకొస్తే నేను నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చేస్తాను అని చెబుతుంది.

4 / 5
ఎందుకంటే? ఆ అమృతం తన కుమారులు తాగడం వలన వారికి అమరత్వం కలుగుతుందని, దీంతో గరత్ముంతుడు పోరాడి అమృతం తీసుకొస్తాడు, కానీ అది పాములకు దక్క కూడదని ఇంద్రుడికి అప్పగిస్తాడు, ఈ క్రమంలో కొన్ని బిందువులు దర్భ గడ్డిపై పడగా, పాములు వాటిని నాకుతాయి. అయితే దర్భలు కాస్త పదునుగా ఉండటం వలన పాముల నాలుక రెండుగా చీలుతుంది. అప్పుడు తన తల్లిని దాసిగా ఉంచినందుకు, గరత్మంతుడు కద్రువ సంతానం ఇప్పటి నుంచి నాలుక చీలి ఉంటుందని శాపం పెడుతాడు. అలా పాముల నాలుకలు చీలి, రెండుగా ఉంటాయంట. ( నోట్ : ఇది ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)

5 / 5
Follow Us
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు

బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..

వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?

ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు

మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..

అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ

కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!

సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..

భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం

ఐర్లాండ్‌తో ఓపెనింగ్ జోడీ ఫిక్స్.. 6 ఓవర్లలోనే మ్యాచ్ క్లోజ్..