- Telugu News Photo Gallery Spiritual photos Astrology 2025: September's Planetary Shifts and Lucky Zodiac Signs Details in Telugu
సెప్టెంబర్‌లో రాశి మారనున్న కీలక గ్రహాలు.. వీరిని అదృష్టం పట్టడం ఖాయం..!
September 2025 Lucky Zodiac Signs: సెప్టెంబర్ నెలలో ఏకంగా నాలుగు ముఖ్యమైన గ్రహాలు రాశులు మారుతున్నాయి. బుధుడు సింహ రాశిలోకి, కుజుడు తులా రాశిలోకి, రవి కన్యారాశిలోకి, శుక్రుడు సింహ రాశిలోకి మారడం జరుగుతుంది. రెండు రోజులకొకసారి రాశి మారే చంద్రుడిని కూడా కలుపుకుంటే అయిదు గ్రహాలు రాశులు మారుతున్నట్టవుతుంది. ఈ విధంగా గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారు అత్యధికంగా శుభ ఫలితాలు పొందుతారు. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభ రాశులకు ఈ రాశి మార్పు వల్ల అదృష్టాలు పట్టడం జరుగుతుంది.
Updated on: Aug 29, 2025 | 3:29 PM

మేషం: రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థాన ప్రవేశంతో ఈ రాశివారికి తప్పకుండా దశ తిరిగే అవకాశం ఉంది. మిగిలిన గ్రహాల అనుకూల సంచారం వల్ల వీరికి ఈ నెలంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరి చయాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదాల్లో విజయం లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు అందుకుంటారు. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. సంపద బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. పంచమ స్థానంలో కుజుడి సంచారం వల్ల పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం: గ్రహాల మార్పుతో ఈ రాశికి ధన స్థానం పటిష్టం అవుతుండడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబ, ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు బాగా సానుకూలపడతాయి. ఆస్తి లాభం, గృహ లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలమవుతుంది. లాభదాయక పరిచయాలు వృద్ది చెందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుదలకు బాగా అవకాశం ఉంది.

సింహం: ఈ రాశ్యధిపతి రవి ధన స్థానంలోకి మారడం, ఈ రాశిలో బుధ, శుక్రులు ప్రవేశించడం వల్ల జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవనశైలి బాగా మారుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి గ్రహాల మార్పుతో భాగ్య, దశమ స్థానాలు బలపడుతున్నందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయం సాధించడం జరుగుతుంది. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కుంభం: నాలుగు గ్రహాల మార్పుతో ఈ రాశికి సప్తమ స్థానం బలోపేతం కావడం వల్ల ఈ రాశివారికి ఊహించని విధంగా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి వార సత్వపు ఆస్తి, సంపద లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.



