- Telugu News Photo Gallery Spiritual photos Astrological Forecast: These Lucky Zodiac Signs to get Financial Relief Soon details in Telugu
Money Astrology: హమ్మయ్య.. ఇక ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
Astrological Forecast: కొన్ని రాశుల వారికి సమీప భవిష్యత్తులో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, అప్పుల ఒత్తిడి తదితర బాధల నుంచి బయటపడడంలో 11వ స్థానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ 11వ స్థానం, 11వ స్థానాధిపతి అనుకూలంగా ఉన్న పక్షంలో ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి త్వరలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
Updated on: May 31, 2025 | 12:06 PM

మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచారం చేయడం వల్ల ఊహించని విధంగా ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు క్రమంగా కనుమరుగవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడికి అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాల విషయంలో పురోగతి తప్ప తిరోగమనం ఉండక పోవచ్చు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ నుంచి బయటపడడం జరుగుతుంది.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా త్వరలో ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడం వల్ల రుణ సమస్యలు మరింత త్వరగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడానికి, పదోన్నతులు కలగడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఫలితంగా వీరికి ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన గురుడి సంచారం వల్ల ఒకటి రెండు నెలల్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ధన కారకుడైన గురువు ఆదాయ వృద్ధి స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు.

తుల: ఈ రాశికి పదకొండవ స్థానంలో ధనాధిపతి కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందే అవకాశం ఉంది. ఫలితంగా రుణ సమస్యలు, ఆర్థిక అవసరాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వడంతో పాటు ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కనకవర్షం కురిపిస్తాయి. కొత్తగా రుణాలు చేసే అవకాశం కూడా లేదు.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానం మీద రాశ్యధిపతి, దన కారకుడు అయిన గురువు దృష్టి పడడంతో పాటు, లాభాధిపతి శుక్రుడు కూడా లాభ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల అతి త్వరలో ఈ రాశివారు ఆర్థిక సంబంధమైన సమస్యలన్నిటి నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ రాశివారికి కలలో కూడా ఊహించని విధంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి.

మకరం: ఈ రాశికి 11వ స్థానం మీద లాభాధిపతి కుజుడి దృష్టి పడినందువల్ల అతి త్వరలో ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. గృహ, వాహన సంబంధమైన రుణాలు కూడా చాలావరకు తీరిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం వల్ల ఊరట కలుగుతుంది.



