- Telugu News Photo Gallery Spiritual photos Telugu Toe Length Personality Traits and Cultural Beliefs
Foot Finger Astrology: కాలి వేళ్ళ పొడవు బట్టి మీ వ్యక్తిత్వం.. ఎలా ఉంటుందంటే.?
కాలి వేళ్ళ పొడవు వ్యక్తిత్వ లక్షణాలను సూచిస్తుందని తెలుగు సంప్రదాయ నమ్మకాలు చెబుతున్నాయి. బొటనవేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయని, మూడవ వేలు పొడవుగా ఉంటే మానసికంగా దుర్బలంగా ఉంటారని చెబుతారు. ఇందులో కాలి వేళ్ళ పొడవు ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలుసుకుందాం..
Updated on: May 31, 2025 | 11:06 AM

బొటనవేలు కంటే రెండవ వేలు పొడవుగా ఉండే వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని నమ్ముతారు. అలాంటి వారు ధైర్యవంతులు, నిర్ణయాత్మకత కలిగి ఉంటారు. ఇతరులను ప్రోత్సహించే సామర్థ్యం కలిగి ఉంటారు. వారు సమస్యలను ఎదుర్కొనేటప్పుడు సమర్ధవంతంగా పనిచేస్తారు. వారి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తారు.

మూడవ వేలు పొడవుగా ఉండేవారు మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉండవచ్చునని నమ్ముతారు. అయితే వారు చాలా చాకచక్యంగా పనులను పూర్తి చేస్తారని కూడా చెబుతారు. వారు వివరాలపై దృష్టి పెడతారు. చిన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

బొటనవేలు కంటే మిగతా వేళ్ళు చిన్నగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో సుఖంగా ఉంటాడు. కష్టాలను సులభంగా ఎదుర్కొంటాడు. వారు సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఆనందిస్తారు. ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.

బొటనవేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉంటే, ఆ వ్యక్తి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. వారు కుటుంబ సభ్యులతో అనుబంధం కలిగి ఉంటారు. వారి అభిప్రాయాలను వినడానికి ఇష్టపడతారు.

అయితే వ్యక్తిత్వాన్ని నిర్ణయించే అనేక దారులు ఉన్నాయి. కాలి వేళ్ళ పొడవు ఒక్కటే వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి సరిపోదని గమనించాలి. ఇది కొన్ని వర్గాల నమ్మకం మాత్రమే. దీనిపై ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు.




