Headache Solution: మిమ్మల్ని తలనొప్పి పదేపదే బాధిస్తుందా..? హోమ్ రెమెడీస్‌తో అద్భుతమైన ప్రయోజనం
ప్రతి ఒక్కరికి సరైన నిద్ర అవసరం. ప్రతి రోజు సమయానికి భోజనం చేసి సమయానికి నిద్రపోవడం చాలా అవసరం. సరైన నిద్రలేని కారణంగా కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే నిపుణులు కూడా సరైన నిద్ర ఉండాలని సూచిస్తున్నారు. అల్లం టీని ఎవరు ఇష్టపడరు? అల్లం టీ తలనొప్పికి గ్రేట్ రెమెడీ. ప్రజలు అల్లం టీని దాని..
Updated on: Oct 07, 2023 | 6:46 PM

యోగా, వ్యాయామం, ధ్యానం నేరుగా మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి. రోజూ యోగా, ధ్యానం చేయాలి. ఇవన్నీ ఒత్తిడి, తలనొప్పిని తగ్గిస్తాయి. ప్రతి రోజు యోగా, వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరికి సరైన నిద్ర అవసరం. ప్రతి రోజు సమయానికి భోజనం చేసి సమయానికి నిద్రపోవడం చాలా అవసరం. సరైన నిద్రలేని కారణంగా కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే నిపుణులు కూడా సరైన నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.

అల్లం టీని ఎవరు ఇష్టపడరు? అల్లం టీ తలనొప్పికి గ్రేట్ రెమెడీ. ప్రజలు అల్లం టీని దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కోసం ఇష్టపడతారు. ప్రజలు తలనొప్పి వచ్చినప్పుడు ఈ టీని తాగుతారు. దీని వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

వాల్‌నట్‌లు, బాదంపప్పులు, జీడిపప్పు వంటి గింజలను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఎందుకంటే వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి రాదు. వస్తే తగ్గుతుంది.

తలనొప్పికి అత్యంత సాధారణ కారణం శరీరంలో నీరు లేకపోవడమే. రోజూ 1 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడదు. అలాగే తలనొప్పి కూడా ఉండదు. హైడ్రేషన్‌కు ఉత్తమ పరిష్కారమని చెబుతున్నారు.




