Dates: చందమామలాంటి అందం కావాలా? ఐతే రోజూ రెండు ఖర్జూరాలు తింటే సరి..
ఖర్జూరాల్లో ఇతర పండ్ల కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే రోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి పేగుల నుంచి విషపూరిత అంశాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది నిర్విషీకరణకు సహాయపడుతుంది...
Updated on: Nov 02, 2025 | 1:28 PM

ఖర్జూరం రుచికి తీపిగా ఉండటమేకాకుండా ఇందులో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. ఇందులో అనేక పోషక లక్షణాలు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఖర్జూరం మేలు చేస్తుంది. అయితే ఇందులో ఇతర పండ్ల కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే రోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి పేగుల నుంచి విషపూరిత అంశాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది నిర్విషీకరణకు సహాయపడుతుంది.

ఖర్జూరాల్లో ఇతర పండ్ల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్లు వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు డయాబెటిస్, అల్జీమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఫినోలిక్ ఆమ్లాల శోథ నిరోధక లక్షణాల కారణంగా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఖర్జూరాలు తీపిగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితం. వీటిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. అందువల్ల అవి రక్తంలో చక్కెర పెరగడానికి అనుమతించవు. అయితే పరిమితంగా మాత్రమే వీటిని తీసుకోవాలి.

ఖర్జూరంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. ఖర్జూరంలో రాగి, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి సహాయపడతాయి.

ఖర్జూరాలు ఫైటోహార్మోన్లకు మంచి మూలం. ఇది చర్మం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి.చర్మం మరింత సాగేలా చేస్తుంది.




