Sunlight for Vitamin D: విటమిన్ డి కోసం ఏ సమయంలో ఎండలో ఉండాలి?
విటమిన్ డి క్యాప్సూల్స్, ఆహారం ద్వారా కూడా పొందవచ్చు. కానీ సూర్యుడి ఎండ వల్ల విటమిన్ డి అధికంగా లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపం ఉన్నవారికి పెద్దగా మందులు అవసరం లేదు. కానీ ఎండలో కాసేపు నిలబడితే సరిపోతుంది. సూర్యరశ్మికి రోజులో ఉత్తమ సమయం ఏది? ఎప్పుడూ ఎండలో ఉండడం వల్ల సరిగ్గా దీనిని పొందవచ్చు? వంటి సందేహాలు..
Updated on: Nov 02, 2025 | 1:45 PM

సూర్యరశ్మి వల్ల మనకు అవసరమైన విటమిన్ డి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఏ సమయంలో ఎండ నుంచి విటమిన్ డి పొందడానికి అనుకూలమైనదో చాలా మందికి తెలియదు.

నిజానికి, విటమిన్ డి క్యాప్సూల్స్, ఆహారం ద్వారా కూడా పొందవచ్చు. కానీ సూర్యుడి ఎండ వల్ల విటమిన్ డి అధికంగా లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపం ఉన్నవారికి పెద్దగా మందులు అవసరం లేదు. కానీ ఎండలో కాసేపు నిలబడితే సరిపోతుంది. సూర్యరశ్మికి రోజులో ఉత్తమ సమయం ఏది? ఎప్పుడూ ఎండలో ఉండడం వల్ల సరిగ్గా దీనిని పొందవచ్చు? వంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి.

నిజానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైనంత మేర విటమిన్ డి లభిస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి సంశ్లేషణ చేయబడుతుంది. యూరోపియన్ దేశాలలో కనీసం 30 నిమిషాలు 3 రోజుల పాటు సూర్యరశ్మిలో ఉండటానికి అక్కడి పౌరులు ఆసక్తి చూపుతుంటారు.

అయితే ఒక రోజంతా ఎండలో నిలబడటం మంచిది కాదు. వరుసగా మూడు రోజులు చేయాలి. అది కూడా రోజుకు 30 నిమిషాల పాటు చేయాలి. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది.

శరీరంలో మెలనిన్ తక్కువగా ఉన్నవారిలో చాలా తక్కువ సమయంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. కానీ ఆసియా, ఇండియా, ఆఫ్రికాలో నివసించే వారి చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎండలో కొంచెం తక్కువ సమయం గడపడం మంచిది. అయితే కేవలం చేతులకు మాత్రమే ఎండ తగిలితే సరిపోదు. శరీరంలో కనీసం 30 శాతం ఎండ పడేలా చూసుకోవాలి. సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఏ సమయంలోనైనా ఎండలో ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.




