- Telugu News Photo Gallery Political photos CM Jagan's Memantha Siddham Bus Yatra 3rd day in Kurnool District see pics
YS Jagan: జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఫొటోలు..
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కర్నూలు జిల్లాలో ప్రారంభం కానుంది. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర.. భారీ జనం మధ్య కొనసాగుతోంది. పెంచికలపాడు శిబిరం నుంచి తమ ప్రాంతానికి వస్తున్న జగన్ యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Updated on: Mar 29, 2024 | 12:15 PM

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కర్నూలు జిల్లాలో ప్రారంభం కానుంది. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర.. భారీ జనం మధ్య కొనసాగుతోంది. పెంచికలపాడు శిబిరం నుంచి తమ ప్రాంతానికి వస్తున్న జగన్ యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ ఖాన్, డా.జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ బస్సు దిగి ప్రజలను అప్యాయంగా పలకరిస్తున్నారు. సీఎం జగన్ కు వారి సమస్యలను పరిష్కరించాలని కోరగా.. సానుకూలంగా స్పందిస్తూ... వెంటనే అధికారులను ఆదేశిస్తున్నారు.

పలు ప్రాంతాల్లో జగన్ కు జనం నీరాజనం పలుకుతూ .. జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మొత్తంగా.. జనంతో మమేకం అవుతూ, జనం సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ సాగుతోంది సీఎం జగన్ బస్సు యాత్ర.

కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ.. మూడు నియోజకవర్గాల్లో కొనసాగనుంది ఇవాళ్టి యాత్ర. మధ్యాహ్నం ఎమ్మిగనూరులో నిర్వహించే సభ కోసం అంతా సిద్ధమైంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఎమ్మిగనూరు నుంచి ఆదోని, ఆస్పరి మీదుగా పత్తికొండ చేరుకోనుంది జగన్ బస్సు యాత్ర. రాత్రి పత్తికొండ మండలం రాతన గ్రామంలో జగన్ బస చేస్తారు. జిల్లా ముఖ్య నేతలతో భేటీ అవుతారు.

సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర (మేమంతా సిద్ధం– నాలుగో రోజు) కర్నూలు, అనంతపురం జిల్లాలలో కొనసాగనుంది.

కర్నూలు జిల్లా రాతన నైట్ హాల్ట్ నుంచి బయలుదేరి తుగ్గలి చేరుకుంటారు, అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి గరిగెట్ల క్రాస్ మీదుగా జొన్నగిరి చేరుకుంటారు, అక్కడి నుంచి బయలుదేరి బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటికలపల్లి మీదుగా క్రిష్ణంరెడ్డిపల్లి నైట్‌హాల్ట్‌కు చేరుకుంటారు.
