- Telugu News Photo Gallery Ys Jagan's bus Yatra full crowded, scenes of the third day of the bus trip
CM Jagan: జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన నాయకుడు జనం ముందుకు రావడంతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేస్తూ యాత్రను విజయవంతం చేస్తున్నారు.
Updated on: Mar 29, 2024 | 2:42 PM

ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన నాయకుడు జనం ముందుకు రావడంతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేస్తూ యాత్రను విజయవంతం చేస్తున్నారు.

కర్నూలు జిల్లా కోడుమూరులో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ యాత్రకు జనం అడుగడుగున నీరాజనం పడుతున్నారు. యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న జనం పూలతో స్వాగతం పలుకుతున్నారు.

వేమగోడులో వైసీపీ జెండాలు చేతపట్టి జగన్‌కు స్వాగతం పలికారు విద్యార్థులు. తమ మేనమామ సీఎం జగన్ అంటూ విద్యార్థులు నినదించారు.

కోడుమూరులో జగన్‌కు చేనేత మగ్గం గిఫ్ట్‌గా ఇచ్చారు చేనేతలు. సంక్షేమ పథకాలతో మేలు జరిగిందంటూ అభిమానం చాటుకున్నారు. మళ్లీ జగన్ రావాలంటూ నినాదాలు చేశారు.

జగన్‌కు గొర్రె పిల్లను ఇచ్చి అభిమానం చాటుకున్నారు గొర్రె కాపారులు. కోడుమూరులో సాగుతున్న జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.