- Telugu News Photo Gallery New Year Celebrations: New year 2025 best celebration destinations of India
New Year 2024: కొత్త ఏడాదికి అద్భుతంగా వెల్కం చెప్పాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక..
నూతన సంవత్సరం 2025 ప్రారంభం కానుంది. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది న్యూ ఇయర్‌లో ఎక్కడికైనా వెళ్లి సంతోషంగా న్యూ ఇయర్ కు వెల్కం చెప్పడానికి ఇష్టపడతారు. కనుక భారతదేశంలోని కొన్ని బెస్ట్ ప్లేసెస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ఇక్కడ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటే ఒక మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
Updated on: Dec 06, 2024 | 5:58 AM

ఏడాదిలో చివరి నెల డిసెంబర్ నెలలో అడుగు పెట్టేశాం. దీంతో కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పడానికి ప్రజలు సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. కొత్త సంవత్సరంలోని మొదటి రోజు అనేది ప్రజల జీవితాల్లో కొత్త క్యాలెండర్ లాంటిది. జీవితంలో కొత్త ఆశలను కలిగిస్తూ.. ఉత్సాహంగా జరుపుకునే వేడుక. అటువంటి పరిస్థితిలో న్యూ ఇయర్ ని ప్రత్యేకంగా జరుపుకోవడానికి ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వెళ్తారు.

మీరు కూడా నూతన సంవత్సరాన్ని ఇతర ప్రాంతాల్లో జరుపుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. భారతదేశంలోఅద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సందర్శిస్తే కొత్త సంవత్సరంలోని మొదటి రోజు గుర్తుండిపోయేలా చేస్తుంది. కనుక కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కం చెప్పడానికి.. ఆనందంగా గడపడం కోసం మన దేశంలో అందమైన కొన్ని ప్రత్యేక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

గోవా పార్టీ: పార్టీలంటే ఇష్టమైతే గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకోండి. న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ బీచ్, నైట్ లైఫ్, ఇసుకపై అద్భుతమైన డ్యాన్స్ వంటి విభిన్న అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోలేరు. ఇక్కడ కాండోలిమ్ వంటి బీచ్‌లను సందర్శించవచ్చు.

లేక్స్ నగరం ఉదయపూర్: ప్రశాంతమైన ప్రదేశంలో కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవలనుకుంటే సిటీ ఆఫ్ లేక్స్ ఉదయపూర్‌కి కూడా వెళ్లవచ్చు. ఇక్కడ సరస్సు ఒడ్డున, అద్భుతమైన ప్యాలెస్‌లో అందమైన విందును ఆస్వాదించవచ్చు. ఉదయపూర్ ప్రశాంత వాతావరణం మంచి అనుభూతిని ఇస్తుంది.

రిషికేశ్: ఆధ్యాత్మికతతో సంబంధం ఉన్న వ్యక్తులు రిషికేశ్‌ను సందర్శించవచ్చు. శాంతిని ఇష్టపడే వారికి కూడా ఇది గొప్ప గమ్యస్థానం. గంగా తీరంలో హారతిలో పాల్గొని యోగా, ధ్యానం చేయడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు ఇక్కడ సాహస క్రీడలను కూడా ఆస్వాదించవచ్చు.

ముంబై మెరైన్ డ్రైవ్: న్యూ ఇయర్ వేడుకలకు ముంబై కూడా ఉత్తమ గమ్యస్థానం. గేట్‌వే ఆఫ్ ఇండియాలో సమీపంలో నిర్వహించే క్లబ్‌లు, ప్రత్యక్ష సంగీత కచేరీలు, కార్యక్రమాలను ఇష్టపడతారు. ముంబైలో న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ను ఎప్పటికీ మరచిపోలేరు. అంతేకాదు మెరైన్ డ్రైవ్ లేదా చౌపటీని కూడా సందర్శించవచ్చు.




