Ajwain Leaf Pickle: వాము ఆకు పచ్చడి అన్నంలో కలిపి తింటే అద్భుతం.. ఎలా తయారు చేసుకోవాలంటే..

భారతీయుల వంటల్లో ఉపయోగించే పదార్దాల్లో వాము ఒకటి. దీనిని వంటకాలతో పాటు పలురకాల పానీయాలు తయారీకి ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు కలిగి ఉంటుంది. వాము గింజలుతో ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో అదేవిధంగా వాము ఆకులతో కూడా అంతే మేలు.ఈరోజు వాము ఆకుతో పచ్చడి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

|

Updated on: Jul 07, 2023 | 5:29 PM

భారతీయుల వంటల్లో ఉపయోగించే పదార్దాల్లో వాము ఒకటి. దీనిని వంటకాలతో పాటు పలురకాల పానీయాలు తయారీకి ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు కలిగి ఉంటుంది. వాము గింజలుతో ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో అదేవిధంగా వాము ఆకులతో కూడా అంతే మేలు.

1 / 7
అందుకే కనీసం మూడు నెలలకు ఒక్కసారైనా వాము పొడి, వాము ఆకు కాని వాడితే ఉదరం శుభ్ర పడుతుంది. ఈ వాము ఆకుతో చాలా మంది బజ్జీలు, రోటి పచ్చడి కూడా చేస్తారు. ఈరోజు వాము ఆకుతో పచ్చడి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

2 / 7
కావలసిన పదార్ధాలు: వాము ఆకులు – సుమారు 35 నుంచి 40 వరకూ చింతపండు – నిమ్మకాయంత నూనె – సరిపడినంత ఎండు మిర్చి – 10 మెంతులు – అర స్పూను ఆవాలు – అర స్పూను పసుపు – కొద్దిగా ఇంగువ- కొద్దిగా ఉప్పు – తగినంత

3 / 7
ముందుగా వాము ఆకులను కడిగి శుభ్రం చేసుకోవాలి .తర్వాత స్టౌ వెలిగించి బాణలి పెట్టి నూనె కాకుండా నువ్వులు వేసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించి చల్లారిన తర్వాత రోటిలో పొడి చేసుకొని వేరే ప్లేటులో పెట్టుకోవాలి.

4 / 7
ఆ బాణలిలో వేయించడానికి సరిపడే నూనె వేసి నూనె బాగా కాగిన ధర్వం మెంతులు, ఎండు మిరపకాయలు, ఆవాలు, ఇంగువ వేసి వేయించుకొని ఓ ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత నూనె వేసుకుని వాము ఆకులు, కొంచెం పసుపు వేసి ఆకును నిముషాలు మగ్గనివ్వాలి.

5 / 7
తర్వాత వేయించి ఉన్న పోపు, చింతపండు, తగినంత ఉప్పువేసి రోటి లో మెత్తగా దంచుకోవాలి. తర్వాత మగ్గించిన వాము ఆకును వేసి పచ్చడిల మెత్తగా నూరుకోవాలి. తర్వాత వేయించి ఉన్న నువ్వుల పొడి వేసి దంచుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

6 / 7
అంతే ఎంతో రుచికరమైన వాము ఆకు పచ్చడి సిద్ధం. ఈ వామాకు పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

7 / 7
Follow us