- Telugu News Photo Gallery Cinema photos Prabhas's Salaar Teaser Breaks KGF 2 Record in Social Media telugu cinema news
Salaar: ఇదెక్కడి అరాచకం సామీ.. టీజర్‌తోనే రికార్డ్స్ బద్దలుకొడుతోన్న సలార్.. ఇది ప్రభాస్ క్రేజ్..
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సలార్ టీజర్. విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడా చూసిన సలార్ మాయే కనిపిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతి హాసన్, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Updated on: Jul 07, 2023 | 5:21 PM

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సలార్ టీజర్. విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడా చూసిన సలార్ మాయే కనిపిస్తోంది.

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతి హాసన్, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

కేజీఎఫ్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేసిన ఎదురుచూపులకు టీజర్‌తో సర్ ప్రైజ్ ఇచ్చారు.

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సలార్ టీజర్. విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడా చూసిన సలార్ మాయే కనిపిస్తోంది.

డార్లింగ్ ఫ్యాన్స్ ఊహించినదానికంటే అద్భుతమైన ఎలివేషన్స్‌తో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఫుల్ మాస్ అవతారంలో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్.

జూన్ 6న విడుదలైన సలార్ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 24 గంటల్లో ఈ టీజర్ 83M+ మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ అందుకుంది. కేవలం 24 గంటలలో అత్యధిక వ్యూస్ అందుకున్న టాప్ 5 లిస్ట్ లో 4 స్థానాలు ప్రభాస్ పేరు మీదే ఉన్నాయి.

దాదాపు 101M+ వ్యూస్ అందుకుని ఆదిపురుష్ సినిమా మొదటి స్థానంలో నిలవగా.. నిన్నటి వరకు 68.8M వ్యూస్ తో రెండవ స్థానంలో ఉన్న కేజీఎఫ్ స్థానాన్ని సలార్ కబ్జా చేసింది.

ఇక నాలుగు, అయిదు స్థానాల్లో రాధేశ్యామ్ 46.6M వ్యూస్, సాహో 44.5M వ్యూస్‌తో నిలిచాయి. మొత్తం మీద టాప్ 5 లిస్ట్ లో 4 ప్రభాస్ పేరు మీద ఉండడంతో ఫ్యాన్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నారు.

ఇదెక్కడి అరాచకం సామీ.. టీజర్‌తోనే సరికొత్త రికార్డ్స్ బద్దలుకొడుతోన్న సలార్.. ప్రభాస్ క్రేజ్ అంటే మాములుగా ఉండదు..




