- Telugu News Photo Gallery international yoga day 2024: best apps for yoga to benefit body and mind in telugu
Yoga Day 2024: శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఇంట్లోనే యోగా నేర్చుకోవాలనుకుంటున్నారా .. ఈ యాప్స్ బెస్ట్ గురూ
యోగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు మానసికంగా కూడా మేలు చేస్తుంది. యోగా చేయడం వల్ల శరీరంలోని అనేక రకాల సమస్యలు నయమవుతాయి. మానసికంగా ప్రసాంతంగా ఉంటారు. అయితే యోగాను అభ్యసించాలంటే మొదట గురువు సహాయం అవసరం. అయితే యోగా ఎలా చేయాలో తెలియ చెప్పడానికి నియమాలను తెలియజేసేందుకు గురువు లా పని చేస్తున్నాయి కొన్ని రకాల యాప్స్ . ఈ రోజు శరీరం ఫిట్ గా ఉండేలా చేసే యోగాని గురువుగా నేర్పించే మూడు యాప్‌లున్నాయి. ఈ యాప్ ల ద్వారా ఎవరైనా సరే యోగా చేయడం చాల సులభంగా నేర్చుకోవచ్చు.
Updated on: Jun 19, 2024 | 3:38 PM

యోగా శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అదే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేలా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. యోగా చేయడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. దీనితో పాటు యోగా శ్వాస, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

యోగా ఎలా చేయాలో మీకు తెలియకపోతే.. గురువు ద్వారా నేర్చుకోవలసి ఉంటుంది. యోగా చేయడంలో సహాయపడే మూడు యోగా యాప్‌ల గురించి ఈరోజు తెలుసుకుందాం..

Daily Yoga: ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫిట్‌నెస్ యాప్ సహాయంతో యోగా, మెడిటేషన్ నేర్చుకోవచ్చు. మీరు మీ అవసరానికి అనుగుణంగా యోగా తరగతులు, ప్రోగ్రామ్‌లు ,భంగిమల్లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఈ యాప్ సరైన యోగా క్లాసెస్ ను తెలుసుకునే విధంగా సహాయపడే స్మార్ట్ కోచ్ ఫీచర్‌ని కలిగి ఉంది.

5 Minute Yoga: ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటే.. ఈ 5 మినిట్స్ యోగా యాప్ మీకు ఉపయోగపడుతుంది. ఈ యాప్ చిన్నదైనా అత్యంత ప్రభావవంతమైన యోగాసనలను, ఫలితాలను వివరిస్తూ యోగా భంగిమలను బోధిస్తుంది. ప్రతి సెషన్ ఐదు నిమిషాల కంటే తక్కువ ఉంటుంది.

Yog4Lyf: ఈ యోగా యాప్ ఇంగ్లీష్.. హిందీలో లైవ్ , ప్రీ-రికార్డ్ ఆన్‌లైన్ యోగా తరగతులను అందిస్తుంది. ఈ యాప్‌లో వివిధ వ్యక్తుల లక్ష్యాల కోసం ప్రాణాయామం, యోగాసన, ధ్యానంకి సంబంధించిన విభిన్న కోర్సులు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి (బరువు తగ్గడం, థైరాయిడ్, ఫేస్ యోగా, వెన్నునొప్పి మొదలైనవి). ఈ కోర్సుల సహాయంతో ఎవరైనా సరే యోగా సులభంగా నేర్చుకోవచ్చు.




