- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli, Rohit Sharma In Race To Break Babar Azam's Record in T20 World Cup 2024
Kohli-Rohit: బాబర్ ఆజాంకు చెక్ పెట్టనున్న కోహ్లీ-రోహిత్ జోడీ.. అదేంటంటే?
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో 4 పరుగులు చేస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పేరిట కొత్త ప్రపంచ రికార్డు క్రియేట్ అవుతుంది. అయితే, ఈ ఇద్దరిలో ఎవరు ఈ వరల్డ్ రికార్డ్ సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Updated on: Jun 19, 2024 | 3:06 PM

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును లిఖించేందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఇద్దరు దిగ్గజాలు కేవలం 4 పరుగులే చేయాల్సి ఉండడం విశేషం.

అంటే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డ్ పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పేరిట ఉంది. బాబర్ 116 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 4145 పరుగులు సాధించి ఈ రికార్డు సృష్టించాడు.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 112 టీ20 ఇన్నింగ్స్‌లలో 4042 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 146 ఇన్నింగ్స్‌లలో 4042 పరుగులు చేశాడు.

అంటే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఇక్కడ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలంటే కేవలం 4 పరుగులు మాత్రమే కావాలి. ఈ నాలుగు పరుగులతో టీ20 క్రికెట్‌లో రన్ లీడర్‌ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.




