- Telugu News Photo Gallery How to tackle depression stress management techniques change these habits for Mental Health
Mental Health: ఈ నాలుగు అలవాట్లు ఉంటే.. మీ మైండ్ దొబ్బినట్లే.. ముందే జాగ్రత్త పడండి..
Mental Health: ఉరుకులు పరుగుల జీవితం.. పైగా బాధ్యతలు, పని ఒత్తిడి.. ఇలా ప్రతి ఒక్కరి జీవితం టెన్షన్ గా మారుతోంది. ఇది సర్వసాధారణమైనా.. డబ్బు కొరత, పరీక్షల్లో ఫేయిల్, పనులు జరగకపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల మరింత ఒత్తిడి మొదలవుతుంది.
Updated on: Jul 17, 2023 | 1:19 PM

Mental Health: ఉరుకులు పరుగుల జీవితం.. పైగా బాధ్యతలు, పని ఒత్తిడి.. ఇలా ప్రతి ఒక్కరి జీవితం టెన్షన్ గా మారుతోంది. ఇది సర్వసాధారణమైనా.. డబ్బు కొరత, పరీక్షల్లో ఫేయిల్, పనులు జరగకపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల మరింత ఒత్తిడి మొదలవుతుంది. అయితే, చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఒత్తిడి వస్తుందన్న మీకు తెలుసా..? చాలా సార్లు మెదడు అకస్మాత్తుగా పని చేయదు.. మన ఆలోచనా శక్తి పోయినట్లు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి కొన్ని చెడు అలవాట్లను ఇప్పటినుంచే వదిలివేయడం చాలా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ అలవాట్లను వదిలేయండి..

బ్రేక్ ఫాస్ట్ మానేయడం: తరచుగా మనం ఉదయాన్నే స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్ కి వెళ్లాలనే తొందరలో ఉంటాం.. దీని వల్ల బ్రేక్ ఫాస్ట్ మిస్ అవుతాం. కానీ ఈ అలవాటు సరైనది కాదు, ఎందుకంటే ఇది మెదడులో బలహీనతను కలిగిస్తుంది. అందుకే ఏ సందర్భంలోనైనా అల్పాహారం తినండి.

తీపి పదార్థాలు: తీపి పదార్ధాలను ఇష్టపడని వారంటూ ఉండదు.. కానీ స్వీట్లు మన మానసిక ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. . అందుకే స్వీట్లు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ వంటి వాటికి దూరంగా ఉండండి. బదులుగా, కొబ్బరి నీరు, ఖర్జూరం వంటి సహజ చక్కెర ఉన్న వాటిని తినండి.

ఎక్కువగా కోపం తెచ్చుకోవడం: మానసిక ఆరోగ్యానికి కోపం అస్సలు మంచిది కాదు. మీరు ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ, మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మన మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది మానసిక సమస్యలను సైతం కలిగిస్తుంది.

సరైన నిద్ర: మీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మంచి ఆరోగ్యం కోసం సరైనవిధంగా నిద్ర పోవాలి.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. లేకపోతే మీ మెదడు సరిగ్గా పని చేయదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.




