- Telugu News Photo Gallery Cinema photos Top 5 Film News on July 17th in industry Telugu Entertainment Photos
Tollywood To Bollywood: టాలీవుడ్ లో చిరు.. బాలీవుడ్ లో ఆలియా.. మధ్యలో రష్మిక.
మెగా అభిమానుల్లో చిరు లీక్స్ సందడి కనిపిస్తోంది.తన జీవితం చాలా మారిపోయిందని అంటున్నారు నటి ఆలియా భట్. రజనీకాంత్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'జైలర్'.రష్మిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా 'రెయిన్‌బో'.
Updated on: Jul 17, 2023 | 1:11 PM

మెగా అభిమానుల్లో చిరు లీక్స్ సందడి కనిపిస్తోంది.తన జీవితం చాలా మారిపోయిందని అంటున్నారు నటి ఆలియా భట్. రజనీకాంత్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'జైలర్'.రష్మిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా 'రెయిన్‌బో'.

మెగా అభిమానుల్లో చిరు లీక్స్ సందడి కనిపిస్తోంది. 'భోళా శంకర్'కి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని లీక్ చేశారు మెగాస్టార్. పవన్ సినిమాల్లో అప్పుడప్పుడూ తన ప్రస్తావన ఉంటుందన్నారు. తన డ్యాన్సులకి తమ్ముడు స్టెప్పులేస్తుంటారని చెప్పారు. తొలిసారి తాను 'భోళాశంకర్' సినిమాలో, పవన్ మేనరిజాన్ని అనుకరించానని అన్నారు. తమ్ముడి పాట మస్తుందిలే అంటూ చిరు చేసిన సందడి వైరల్ అవుతోంది.

తన జీవితం చాలా మారిపోయిందని అంటున్నారు నటి ఆలియా భట్. తన భర్త, కూతురు కోసం ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తయిందని అన్నారు. సినిమాల కోసం రాత్రింబవళ్లు పనిచేసిన సందర్బాలున్నాయని చెప్పారు. గతంలో ఫ్యామిలీకి తాను పెద్దగా సమయం కేటాయించలేదని, ఇప్పుడు బాధ్యతలను పూర్తి చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు ఆలియా.

రష్మిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా 'రెయిన్‌బో'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. 'రెయిన్‌బో' ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు మేకర్స్. వైవిద్యమైన రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా 'రెయిన్‌బో'ని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. రష్మిక కేరక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెప్పారు. తెలుగు, తమిళ్‌లో రూపొందుతోంది 'రెయిన్‌బో'.

రజనీకాంత్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'జైలర్'. ఈ చిత్రంలోని రెండో పాట 'హుకుం..' ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్ చెప్పిన డైలాగులతో ఓ వీడియో విడుదలైంది. ఈ పాట పులి హుకుంలాగా ఉంటుందని అన్నారు సూపర్‌స్టార్. రజనీ మాస్ పవర్, ఆయన స్టైల్‌ని హైలైట్ చేసే పాట ఇది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ 'మై అటల్ హూ'. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రను పంకజ్ త్రిపాఠి పోషించారు. రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద అటల్ పాత్రలో కనిపించడం ఆనందంగా ఉందని అన్నారు పంకజ్. ఈ జర్నీ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది 'మై అటల్ హూ'.




