AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఎలుకలతో విసిగిపోయారా? శాశ్వతంగా వదిలించే చిట్కా ఇదిగో..

Home Remedies to Get Rid of Rats without Killing Them: ఇంట్లో ఎలుకలు ఉంటే.. అవి చేసే నష్టం అంతాఇంతా కాదు. ఆహారం మొదలు అన్ని వస్తువులను పాడు చేస్తుంటాయి. వివిధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటి బెడద నుంచి ఉపశమనం పొందడానికి విష పదార్ధాలను ఉపయోగించే బదులు సాధారణ గృహ నివారణలతో లుకలను చంపకుండానే వీటిని నివారించవచ్చు..

Srilakshmi C
|

Updated on: Nov 03, 2025 | 12:57 PM

Share
ఎలుకలు ఇంట్లో బియ్యం మాత్రమే కాకుండా బట్టలు, పుస్తకాలు, ఫర్నిచర్‌కు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలించుకోవాలి. ఇళ్లలో వీటి నివారణకు  చాలా మంది విషపూరిత పదార్థాలను ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని సాధారణ ఇంటి నివారణలతో వాటిని చంపకుండానే సులభంగా వదిలించుకోవచ్చు.

1 / 5
ఇంట్లో ఎలుకల నివారణకు పటికను ఉపయోగించవచ్చు. ఎలుకలకు పటిక వాసన, రుచి నచ్చదు. కాబట్టి మీ ఇంటి మూలల్లో, వంటగదిలో లేదా అల్మారాలో చిన్న పటిక ముద్దలను ఉంచండి. ఇంటి మూలల్లో పటిక పొడిని కూడా వేయవచ్చు.

2 / 5
అలాగే పూజకు ఉపయోగించే కర్పూరం కూడా ఎలుకలను సులభంగా తరిమికొడుతుంది. కర్పూరం బలమైన వాసన ఎలుకలకు ఊపిరాడకుండా చేస్తుంది. అందువల్ల ఇంటి మూలల్లో, ఎలుకలు తరచుగా వెళ్ళే మార్గాల్లో కర్పూరం మాత్రలను ఉంచినా ప్రయోజనం ఉంటుంది. ఇది ఎలుకలను ఇంటికి దూరంగా ఉంచుతుంది.

3 / 5
ఉల్లి, వెల్లుల్లి ఘాటైన వాసన ఎలుకలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లి, వెల్లుల్లి నుంచి రసాన్ని తీసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. దానిలో కొంచెం నీరు కలిపి ఇంట్లో ప్రతి మూలలో పిచికారీ చేస్తే సరి. వేప, యూకలిప్టస్ నూనెల వాసన కూడా ఎలుకలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. వేప, యూకలిప్టస్ నూనెను స్ప్రే బాటిల్‌లో వేసి బాగా కలపాలి. ఎలుకలు వచ్చి వెళ్ళే మార్గాలపై స్ప్రే చేస్తే.. ఆ వాసనకు మళ్లీరానేరావు.

4 / 5
ఎలుకలు పుదీనా ఘాటైన వాసనను తట్టుకోలేవు. పుదీనా నూనెలో దూది బంతులను నానబెట్టి, వాటిని ఇంటి మూలల్లో, అల్మారాలలో, వంటగదిలో వాటిని ఉంచాలి. తద్వారా ఎలుకలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు.

5 / 5
Follow Us