- Telugu News Photo Gallery Healthy Diet Tips: Eating fruits at these times can be dangerous to your health
Healthy Diet: పండ్లు ఈ టైంలో తిన్నారంటే ఒంట్లో విషంగా మారుతాయ్.. జర భద్రం!
ఖాళీ కడుపుతో నీళ్లు, కడుపు నిండిన తర్వాత పండ్లు తినాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇలా చేస్తే డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పండ్లు తినడం వల్ల శరీరానికి లోపలి నుంచి పోషణ లభిస్తుంది..
Updated on: Mar 06, 2025 | 8:19 PM

పండ్లు తినడానికి ఒక పద్ధతి ఉంది. అలా కాకుండా ఎలాపడితే అలా తినేస్తే మంచికి బదులు శరీరానికి హాని కలిగించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడు భోజనం తిన్న తర్వాత మాత్రమే పండ్లు తినాలని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ఇది నిజం కాదు. ఆయుర్వేదం ప్రకారం సరైన నియమాలను పాటించకుండా పండ్లు తినడం ఒంట్లో విషపూరితంగా మారవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆయుర్వేదం ప్రకారం పండ్లు ఎప్పుడూ తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు కడుపులో ఆమ్ల స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల ఆమ్లత్వ సమస్యలతో బాధపడతారు. ఆమ్లం పెరుగుదలకు పుల్లని పండ్లు కారణమవుతాయి.

ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండ్లలో ఉండే ఆమ్లం, చక్కెర తలనొప్పికి కారణమవుతాయి. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. మీకు మైగ్రేన్ సమస్య ఉంటే, సిట్రస్ పండ్లు, అవకాడోలు, రాస్ప్బెర్రీస్, రేగు పండ్లు, అత్తి పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినకపోవడమే మంచిది.

భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ల ప్రభావాలు చర్మంపై కూడా కనిపిస్తాయి.

పండ్లలో ఉండే ఫైబర్ పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల శరీరంలో పోషకాల శోషణ తగ్గుతుంది. ఫలితంగా, ఆహారంలోని పోషక విలువలు కోల్పోతాయి. ఆహారంతో పాటు లేదా కడుపు నిండా పండ్లు తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది.




