- Telugu News Photo Gallery Spiritual photos Shukra Vakri 2025: Wealth and Good Fortune for 6 Lucky Zodiac Signs Details in Telugu
Shukra Vakri: బలపడిన శుక్రుడు.. ఆ రాశుల వారిపై కనక వర్షం పక్కా..! అందులో మీ రాశి ఉందా..
మే నెల మొదటి వారం వరకూ మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న శుక్రుడు వక్రగతి కూడా పట్టడంతో ఆ గ్రహ బలం మరింతగా పెరిగింది. పైగా తనకెంతో ప్రీతిపాత్రమైన బుధ, రాహువులతో కలిసి ఉండడంతో ఈ బలం మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా తనకిష్టమైన, తనకు బాగా అనుకూలమైన రాశుల మీద దాదాపు కనక వర్షం కురిపించడం జరుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశులకు ఊహించని శుభాలు జరిగే అవకాశం ఉంది.
Updated on: Mar 06, 2025 | 8:10 PM

వృషభం: రాశ్యధిపతి శుక్రుడికి బలం పెరగడం వల్ల ఈ రాశికి చెందినవారు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన మహిళలు భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై విలువైన ఆస్తి బాగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు దశమ స్థానంలో బలంగా సంచారం చేస్తుండడం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బలం పుంజుకుంటాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడమంటూ ఉండదు. ఆరోగ్య లాభం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి తొమ్మిదవ స్థానంలో బలమైన శుక్రుడి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కనక వర్షం కురిపిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు సప్తమ స్థానంలో బలంగా ఉన్నందు వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. విదేశీయానానికి అవకాశాలు లభిస్తాయి. అత్యంత సంపన్న కుటుంబానికి చెందినవారితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడికి బలం పెరిగినందువల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ధన స్థానంలో బలం పుంజుకోవడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బును, బాకీలను, బకాయిలను రాబట్టుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.



