- Telugu News Photo Gallery Spiritual photos Good News for Tirupati Balaji devotees. TTD Adds Masala Vada to Anna Prasadam New Menu
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో రోజూ వడ ప్రసాదం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామివారి అన్నప్రసాదంలో మసాలా వడలను చేర్చింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా తయారు చేయబడిన ఈ వడలు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు నేటి నుంచి అందించనున్నారు. ట్రయల్ రన్ తర్వాత భక్తుల నుంచి సానుకూల స్పందన లభించడంతో ఈ కొత్త వంటకం ప్రవేశపెట్టబడింది. దీంతో భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాన్ని టీటీడీ అందిస్తుంది.
Updated on: Mar 06, 2025 | 4:09 PM

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఇష్టమే. తెలుగువారు మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా ఉండే తిరుమలపై ఎప్పుడు రద్దీ నెలకొంటుంది. అదే పండగలు, పర్వదినాల సమయంలో అయితే ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆకలి అన్న మాట గుర్తు లేకుండా టీటీడీ సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తూనే ఉంది. శ్రీవారి భక్తులు క్యూలో నిల్చుకున్నప్పుడు ఆహారం, పానీయాలు అందించడం మాత్రమే కాదు.. నిత్య అన్నవితరణ చేస్తుంది. శ్రీవారి భక్తులు భక్తితో ఎంతో ఇష్టంగా స్వీకరించే స్వామివారి అన్నప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే.

భక్తులకు శ్రీవారి దర్శనం ఎంత ఇష్టమో.. స్వామివారి ప్రసాదం లడ్డు అన్నా అంత ఇష్టమే. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆకలి అన్న మాట తలెత్తకుండా కొండ మీద ప్రత్యెక కౌంటర్స్ లో ఆహారం అందించమే కాదు.. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు మూడు పూటలా స్వామివారి ప్రసాదాన్ని అందిస్తారు. భక్తులు ఉదయం టిఫిన్ మాత్రమే కాదు మధ్యాహ్నం, సాయత్రం కడుపారా అన్న ప్రసాదం స్వీకరించవచ్చు. అయితే ఇప్పుడు ఈ అన్న ప్రసాదంలో ఇప్పుడు భక్తుల కోసం మసాలా వడ కూడా చేరింది.

తాజాగా తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పిడమే కాదు ఈ రోజుని పూర్తి స్థాయిలోకి అమల్లోకి తీసుకొచ్చింది. శ్రీవారి అన్నప్రసాదంలోకి కొత్తగా మరో వంటకం వచ్చి చేరింది.

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు శ్రీవారి భక్తులకు మసాలా వడల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయనే ఆకుల్లో ఈ వడలను వడ్డించారు.

భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించనున్నారు. అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నారు.

అన్నప్రసాదం మెనూలో వడలను చేర్చాలని టీటీడీ పాలకమండలి కొత్తగా నియామకమైన సమయంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు అన్నప్రసాదం మెనూలోకి వడలు చేరాయి.. ఈ రోజు ఉల్లి, వెల్లుల్లి లేకుండా తయారు చేసిన మసాలా వడలు అన్న ప్రసాదంలో కొత్త ఐటెం గా వచ్చి చేరాయి.

అన్న ప్రసాదంలో వడలు చేర్చాలి అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ముందు ట్రయిల్ రన్ నిర్వహించారు. జనవరిలో సుమారుగా ఐదు వేల మంది భక్తులకు వడలు వడ్డించి ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

సుమారు 50 వేల మంది భక్తులకు ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా తయారు చేసిన మసాలా వడలు వడ్డించి భక్తుల అభిప్రాయాన్ని టీటీడీ సిబ్బంది తెలుసుకున్నారు. భక్తులు వడల రుచి విషయంలో సంతృప్తి వ్యక్తం చేయటంతో.. ఈ రోజు నుంచి భక్తులకు పూర్తిస్థాయిలో అన్నప్రసాదంలో అందిస్తున్నారు.




