- Telugu News Photo Gallery Spiritual photos Saturn Transit in Pisces: Astrological Predictions for 5 Lucky Zodiac Signs Details in Telugu
Lord Shani: శని రాశి మార్పుతో ఎవరికి లాభం? వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..!
Saturn Transit in Pisces: ఈ నెల(మార్చి) 29న శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారడం జరుగుతోంది. శని రాశి మారడమన్నది చిన్న విషయమేమీ కాదు. రెండున్నరేళ్లుగా నానా రకాల కష్టనష్టాలు అనుభవిస్తున్న కొన్ని రాశుల వారికి తప్పకుండా అతిపెద్ద ఉపశమనం లభిస్తుంది. శని రాశి మారినంత మాత్రాన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ పురోగతి ఉంటుందని ఆశించలేం. ఆ రాశికి ఏ స్థానంలోకి శని మారాడన్నదానిపై ఆ పురోగతి ఆధారపడి ఉంటుంది. శని రాశి మార్పు వల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారి జీవితాల్లో తప్పకుండా చెప్పుకోదగ్గ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శని మార్పు ఒక్కో రాశికి ఒక్కో విధంగా ఉంటుంది.
Updated on: Mar 07, 2025 | 3:24 PM

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని ప్రవేశం వల్ల మార్చి 30 నుంచి వీరి జీవితాల్లో స్తబ్ధత తొలగిపోవడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో పెండింగులో ఉన్న పదోన్నతులు ఇప్పుడిక లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరిగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో రెండున్నరేళ్లపాటు అనూహ్యమైన పురోగతి ఉంటుంది.

కర్కాటకం: ఈ రాశికి అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. మరో రెండున్నరేళ్లపాటు వీరి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి పూర్తిగా బయ ట పడడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, ఇతర కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

తుల: ఈ రాశికి శనీశ్వరుడు ఆరవ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల విపరీతమైన ఆర్థికాభివృద్ధికి అవ కాశం ఉంటుంది. అనేక మవైపుల నుంచి ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభాల పంట పండిస్తాయి.

వృశ్చికం: ఈ రాశికి శని రాశి మార్పుతో అర్ధాష్టమ శని తొలగిపోయి, అనేక విధాలుగా ఊరట లభిస్తుంది. కుటుంబ జీవితం బాగుపడుతుంది. కుటుంబంలోని విభేదాలన్నీ తొలగిపోయి, మళ్లీ సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిల్లల పురోగతికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. నష్టదాయక వ్యవహారాల నుంచి బయటపడతారు.

మకరం: ఈ రాశికి శని ధన స్థానం నుంచి తృతీయ స్థానానికి మారుతున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అనేక విషయాల్లో జ్ఞానోదయం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోవడం మొదలవుతుంది. ఆర్థిక నిర్వహణ అలవడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. సంపద పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి.



