ఆప్రికాట్ పండ్లలో వివిధ రకాల ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ పండు తింటే జీర్ణం సులువుగా కడుపు క్లీన్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీటా-కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు వంటి పదార్థాలు శరీరంలోని యాంటీ-క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షిస్తాయి.