High Blood Pressure: అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదంటున్న నిపుణులు

హైపర్ టెన్షన్ కూడా ఓ విధమైన సైలెంట్ కిల్లర్. అధిక రక్తపోటు ప్రాణాలను నెమ్మదిగా హరిస్తుంది. మీకూ అధిక రక్తపోటు సమస్య ఉంటే ప్రతిరోజూ తప్పకుండా మెడిసిన్‌ తీసుకోవాలి. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. అసలు అధిక రక్తపోటు ఎందుకు దాడి చేస్తుంది? ఈ సమస్యను ఎలా నియంత్రించవచ్చు వంటి వివరాలు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.. BM బిర్లా హార్ట్ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగం..

High Blood Pressure: అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదంటున్న నిపుణులు
High Blood Pressure
Follow us
Srilakshmi C

|

Updated on: May 20, 2024 | 12:35 PM

హైపర్ టెన్షన్ కూడా ఓ విధమైన సైలెంట్ కిల్లర్. అధిక రక్తపోటు ప్రాణాలను నెమ్మదిగా హరిస్తుంది. మీకూ అధిక రక్తపోటు సమస్య ఉంటే ప్రతిరోజూ తప్పకుండా మెడిసిన్‌ తీసుకోవాలి. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. అసలు అధిక రక్తపోటు ఎందుకు దాడి చేస్తుంది? ఈ సమస్యను ఎలా నియంత్రించవచ్చు వంటి వివరాలు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.. BM బిర్లా హార్ట్ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సబ్యసాచి పాల్ మాట్లాడుతూ.. రక్తపోటు వెనుక అనేక జీవనశైలి కారకాలను వివరించారు. వీటిలో వ్యాయామం నుంచి ఊబకాయం, ధూమపానం వరకు అనేక కారకాలు ఉన్నాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని డాక్టర్ సబ్యసాచి పాల్ అంటున్నారు. కానీ రోజువారీ ఏరోబిక్ వ్యాయామం రక్తపోటును పెంచుతుంది. ముఖ్యంగా రక్తపోటు అదుపులో లేని వారు, శరీర బరువు పెరిగినవారికి, ఊబకాయంతో బాధపడుతున్నవారికి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం కారణంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా తరచుగా సంభవిస్తుంది. ఇది రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

ప్రిజర్వేటివ్స్, చక్కెర, ఉప్పుతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు రక్తపోటుకు కారణమని డాక్టర్ సబ్యసాచి పాల్ చెబుతున్నారు. ఇందులో అధిక మొత్తంలో కేలరీలు, సోడియం ఉంటుంది. ఇవి అధిక రక్తపోటుతో పాటు కిడ్నీ సమస్యలు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారించడానికి ఫాస్ట్ ఫుడ్ మానుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రక్తపోటు ప్రమాదాన్ని నివారించడానికి, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని డాక్టర్ పాల్ సూచిస్తున్నారు. జీవనశైలి కారకాలు మాత్రమేకాకుండా, రక్తపోటుకు మరొక కారకం కూడా ఉంది. అధిక రక్తపోటుకు ఒత్తిడి కూడా కారణం. ఒత్తిడిని తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మీరు హైపర్‌టెన్షన్ రోగి అయితే, ప్రతిరోజూ తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. బిఎమ్ బిర్లా హార్ట్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ అంజన్ సియోటియా ఈ విషయాన్ని సూచిస్తున్నారు. చాలా మంది హైపర్ టెన్షన్ కు చికిత్స తీసుకోరని డాక్టర్ అంజన్ అంటున్నారు. సగం కంటే ఎక్కువ మందికి తమకు అధిక రక్తపోటు ఉందనే విషయమే తెలియదు. ఎందుకంటే వారు ఎప్పుడూ రక్తపోటును క్రమం తప్పకుండా టెస్ట్‌ చేయించుకోరు. అలాగే దీనిపై అవగాహన ఉన్న రోగులలో కూడా సగం మంది రోగులు రోజూ మందులు తీసుకోరు. ఈ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. దీంతో పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తరచుగా రక్తపోటు పరీక్షించుకోవాలి. అలాగే మందులు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఇలాచేస్తే రక్తపోటును నియంత్రించడం సులభతరం అవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.