రోజు రాత్రి నిద్రకు ముందు 2 యాలకులు నోట్లో వేసుకుంటే జరిగేదిదే

30 December 2024

TV9 Telugu

TV9 Telugu

యాలకులు సువాసనా, రుచీ కోసం మాత్రమే కాదు... వాటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అందుకే యాలకులు ప్రతి భారతీయుడి ఇంటిలో కనిపిస్తాయి 

TV9 Telugu

ఈ సుగంధ మసాలాలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాన్సర్‌ కారక కణాలు పెరగకుండానూ అడ్డుకుంటాయట. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి

TV9 Telugu

అంతేకాదు ఐరన్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు యాలకులలో ఉంటాయి. అందుకే చలికాలంలో రోజూ కనీసం రెండు ఏలకులు తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

యాలకుల్లో ఉండే కీలక విటమిన్లు,  ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌... జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించి... మెరిసిపోయేలా చేస్తాయి

TV9 Telugu

అన్నం తిన్నాక రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు... ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలోని ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. నోటి దుర్వాసన తగ్గిస్తాయి

TV9 Telugu

యాలకుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే... శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి

TV9 Telugu

మీకు నిద్రలేమి సమస్య ఉంటే, యాలకుల వినియోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి

TV9 Telugu

గ్యాస్, ఎసిడిటీ లేదా పొట్ట సమస్యలతో బాధపడేవారు భోజనం తర్వాత యాలకులు తప్పనిసరిగా తినాలి. రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు ఇట్టే తగ్గుతుంది