పోషకాహారం అనగానే మనకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పుల వంటివే గుర్తుకొస్తాయి. కానీ బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్).. ఖర్జూరం, కిస్‌మిస్, అంజీరా వంటి డ్రై ఫ్రూట్స్ గురించి పెద్దగా పట్టించుకోం
TV9 Telugu
నిజానికివి మంచి పోషకాల గనులు. మేలిరకం కొవ్వులు, విటమిన్లతో పాటు ఫాస్ఫరస్, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు వీటిల్లో దండిగా ఉంటాయి
TV9 Telugu
ఇవన్నీ కీలకమైన అవయవాలు సరిగా పనిచేసేలా చూడటమే కాదు.. రకరకాల జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి. ముఖ్యంగా జీడిపప్పులో మంచి కొవ్వులు (మోనో అసంతృప్త కొవ్వులు) అధికంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి గుండె ఆరోగ్యం పెంపొందటానికి తోడ్పడతాయి. వీటిల్లోని విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నందున ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
అయితే జీడిపప్పును నానబెట్టి తినాలా లేక అలాగే తినాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం నానబెట్టిన జీడిపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
అయితే ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. జీడిపప్పులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది
TV9 Telugu
ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన జీడిపప్పును తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యకరమైన కొవ్వులను సులభంగా గ్రహించేలా చేస్తుంది
TV9 Telugu
నానబెట్టిన జీడిపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పైగా జీడిపప్పును నానబెట్టడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిల్లోని విటమిన్ ఇ, విటమిన్ కె, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు శరీరం బాగా గ్రహిస్తుంది