- Telugu News Photo Gallery Flax Seeds Health Benefits: Why You Should Definitely Be Eating Flaxseeds Everyday
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రాలే..
ప్రస్తుత కాలంలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి ముఖ్యంగా.. బరువు పెరగడంతోపాటు.. పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మనలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వారికి అద్భుతమైన ఔషధం అవిసె గింజలు..
Updated on: May 01, 2024 | 5:30 PM

ప్రస్తుత కాలంలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి ముఖ్యంగా.. బరువు పెరగడంతోపాటు.. పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మనలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వారికి అద్భుతమైన ఔషధం అవిసె గింజలు.. ఇవి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా అవిసెగింజల్లో ఆరోగ్య నిధి దాగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అవిసె గింజలు గుండెకు కూడా మేలు చేస్తాయి. అయితే మీరు ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతుంటే, అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది..

వాస్తవానికి డ్రై ఫ్రూట్స్, విత్తనాలు ప్రోటీన్ కు మంచి మూలంగా పరిగణిస్తారు. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు, కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీకు అవసరమైన పోషకాలు అందుతాయి. మీ ఆకలిని కూడా తగ్గిస్తుంది. బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి.. ఇవి ఆరోగ్యకరమైనవి.. పోషకమైనవి.

గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది: అవిసెగింజలు అనేక లక్షణాలతో నిండి ఉన్నాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రక్త కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది: ఫ్లాక్స్ సీడ్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడతాయి. అధ్యయనాల ప్రకారం.. రోజూ అవిసెగింజలు తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలు 6 నుంచి 11 శాతం వరకు తగ్గుతాయి. ఇందులో ఫైబర్, లిగ్నాన్ అధికంగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అవిసెగింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీ జీర్ణ శక్తిని పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అవిసెగింజల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు: శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవిసెగింజల్లో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి పనిచేస్తాయి. వీటిల్లో ఫైటోఈస్ట్రోజెన్లు, యాంటీ యాసిడ్లలో కూడా సమృద్ధిగా ఉన్నాయి.

మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే రోజూ 2 నుంచి 3 టీస్పూన్ల వరకు తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇవి శరీరానికి చాలా ఫైబర్‌ని కూడా అందిస్తాయి. రక్తపోటు, హృదయ స్పందన రేటును సాధారణ స్థాయికి తీసుకురావడంలో ఇవి సహాయపడతాయి.




