- Telugu News Photo Gallery Cinema photos Bobby deol in for nagarjuna film, heroine mehreen pirzada egg freezing
కింగ్ కోసం రంగంలోకి యానిమల్ విలన్.. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న మెహ్రీన్
హౌస్ ఆఫ్ వ్యాక్స్ మూవీ చూశాక తాను వ్యాక్సింగ్ చేయించుకోవడం మానేశానని అన్నారు తమన్నా. వ్యాక్స్ తో పలు రకాలుగా చంపడం చూసిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆమె నటించిన బాక్ మే 3న విడుదల కానుంది. ఈ సినిమాలో తమన్నాతో పాటు రాశీ ఖన్నా కూడా నటించారు. రాశీ నిజాయతీగా పని చేస్తారని మెచ్చుకున్నారు తమన్నా. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన బర్ఫీలో నటించిన కారణంగా తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని అన్నారు నటి ఇలియానా.
Updated on: May 01, 2024 | 3:44 PM

Tamannaah Bhatia: హౌస్ ఆఫ్ వ్యాక్స్ మూవీ చూశాక తాను వ్యాక్సింగ్ చేయించుకోవడం మానేశానని అన్నారు తమన్నా. వ్యాక్స్ తో పలు రకాలుగా చంపడం చూసిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆమె నటించిన బాక్ మే 3న విడుదల కానుంది. ఈ సినిమాలో తమన్నాతో పాటు రాశీ ఖన్నా కూడా నటించారు. రాశీ నిజాయతీగా పని చేస్తారని మెచ్చుకున్నారు తమన్నా.

Ileana D'Cruz: అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన బర్ఫీలో నటించిన కారణంగా తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని అన్నారు నటి ఇలియానా. సౌత్‌లో బిజీగా ఉన్న సమయంలో బర్ఫీ వచ్చిందని చెప్పారు. కథ నచ్చడంతో అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదని అన్నారు. ఆ సినిమా హిట్ కావడంతో బాలీవుడ్‌కే పరిమితమవుతానని సౌత్ మేకర్స్ అపోహపడ్డారని చెప్పారు.

తన సోదరుడు సన్నీడియోల్ చెప్పిన మాటలు విని కంట తడి పెట్టుకున్నారు బాబీ డియోల్. 2023 తమకు కావాల్సిన అన్నీ ఇచ్చిందని అన్నారు. ప్రతి కుటుంబానికీ ఓ సూపర్‌మ్యాన్ ఉంటారని, తమ ఫ్యామిలీకి అలాంటి వ్యక్తి సన్నీ అని అన్నారు బాబీ డియోల్. బాబీ సౌత్‌లో ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు.

Nayanthara: సమాజంలో అసమానతలను అధిగమించి సక్సెస్ అయ్యే కథా పాత్రల్లో నటించడం తన కర్తవ్యమని చెప్పారు నయనతార. మహిళల గొంతుకను ప్రతిబింబించే పాత్రలు చేయాలని ఉందని అన్నారు. పాత్రల ఎంపిక విషయంలో తన మనసు ఏం చెబితే అదే చేస్తానని అన్నారు నయన్.

Mehreen Pirzada: తల్లి కావడం అనేది తన కల అని అన్నారు మెహ్రీన్ ఫిర్జాదా. కాకపోతే కొన్నాళ్లు ఆలస్యం కావచ్చని, అందుకే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నానని అన్నారు. హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే తనకు భయమని, అయినా ధైర్యంగా ముందడుగు వేశానని చెప్పారు. తన రెండేళ్ల ప్రయత్నం ఇప్పటికి ఫలించిందని చెప్పారు మెహ్రీన్.




