AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Film News: ట్రెండింగ్‌ స్టార్‌ మహేష్.. పొలిమేర 2కి అరుదైన గౌరవం..

సోషల్‌ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ అవుతున్నారు మహేష్. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఆమీర్‌ఖాన్‌ కీలక పాత్రలో నటించిన సినిమా పీకే . నాగచైతన్య హీరోగా విరూపాక్ష దర్శకుడు కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది పొలిమేర2. దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: May 01, 2024 | 3:46 PM

Share
సోషల్‌ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ అవుతున్నారు మహేష్. ఫ్యామిలీ ఫంక్షన్‌కి హాజరైన ఆయన, అందరితో సరదాగా మాట్లాడటం వైరల్‌ అయింది. దాంతో పాటు జక్కన్న సినిమాలో మహేష్‌ సరసన ఆలియా నటిస్తారనే వార్త స్ప్రెడ్‌ అవుతోంది. మరో విదేశీ భామ కూడా ఈ మూవీలో ఉంటారట. ఆగస్టు 9న సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారట మహేష్‌.

1 / 5
రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారంతో హైదరాబాద్‌లో కీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్. గేమ్‌ చేంజర్‌ కొత్త షెడ్యూల్‌ని మే ఒకటి నుంచి చెన్నైలో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్‌.

2 / 5
ఆమీర్‌ఖాన్‌ కీలక పాత్రలో నటించిన సినిమా పీకే . ఈ చిత్రంలో తాను రేడియో పట్టుకుని నగ్నంగా పరిగెత్తినట్టు చెప్పారు ఆమీర్‌ఖాన్‌. అందరి ముందు నగ్నంగా పరుగులు తీయకుండా దర్శకుడు ఏవో ట్రిక్స్ చేశారని, అయితే అవన్నీ చిరాకుగా అనిపించడంతో... నగ్నంగానే నటించానని అన్నారు ఆమీర్‌ఖాన్‌. ఇప్పుడు ఆ సన్నివేశాలను చూస్తుంటే చేసింది నేనేనా అని అనిపిస్తోందని చెప్పారు.

3 / 5
నాగచైతన్య హీరోగా విరూపాక్ష దర్శకుడు కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఫిక్స్ చేసినట్టు సమాచారం. పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. తెలుగులో నాగచైతన్య, పూజా హెగ్డే జోడీ కట్టడం ఇది రెండో సారి.

4 / 5
అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది పొలిమేర2. దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ప్రేక్షకుల ఆశీర్వాదంతోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు మేకర్స్. సత్యం రాజేష్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించిన సినిమా పొలిమేర2. చేతబడి ఇతివృత్తంగా తెరకెక్కింది ఈ మూవీ.

5 / 5