- Telugu News Photo Gallery Cinema photos Nabha Natesh has pinned hopes on the movies Swayambhu and Darling
Nabha Natesh: ఆ రెండు సినిమాలు ఈ అమ్మడి కెరీర్‌ను టర్న్ చేస్తాయా..?
నభా నటేష్.. రీసెంట్ డేస్ లో ఈ చిన్నదాని పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఈ సినిమా హిట్ అవ్వలేకపోయినా.. నభా నటేష్ తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది.
Updated on: May 01, 2024 | 8:20 PM

నభా నటేష్.. రీసెంట్ డేస్ లో ఈ చిన్నదాని పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఈ సినిమా హిట్ అవ్వలేకపోయినా.. నభా నటేష్ తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది.

ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ అమ్మడి కెరీర్ ను టర్న్ చేసింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చాందిని పాత్రలో మెరిసింది నభా నటేష్. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. అందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టింది నభా నటేష్.

ఆతర్వాత అవేరుశగా సినిమాలు చేసింది కానీ ఆహించిన స్థాయిలో అవి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. చివరిగా అల్లుడు అదుర్స్ అనే సినిమాలో కనిపించింది. ఆతర్వాత ఆక్సిడెంట్ కు గురై సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారింది.

ప్రస్తుతం ప్రియదర్శితో కలిసి డార్లింగ్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాతో పాటు నిఖిల్ నటిస్తున్న స్వయంభు సినిమాలోనూ నటిస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నభా నటేష్ తిరిగి ఫామ్ లోకి రావడం ఖాయం చూడాలి మరి అమ్మడి అదృష్టం ఎలా ఉందో..




