Heart Problem: ఈ 5 లక్షణాలు ఉన్నాయా.? గుండె జబ్బు సూచనలు కావచ్చు..
ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు దీనికి కారణం కావచ్చు. అయితే కొంతమంది ప్రజలు ఫిట్‌గా ఉండాలని అధిక వర్కౌట్ చేస్తూ ఈ గుండె సమస్యల బారిన పడుతున్నారు. కాగా వీటిని సకాలంలో గుర్తిస్తే సమస్యలు దూరమవుతాయి. లేకపోతే ప్రమాదంలో పడతారు. ఈ గుండె జబ్బులను సకాలంలో గుర్తించడం ఎలా అని ఆలోచిస్తున్నారా. గుండెపోటు సహా గుండె సమస్యలకు సంబంధించి కొన్ని ప్రారంభ లక్షణాలు మీ ముందు ఉంచాం. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకొనే ప్రమాదం నుంచి బయటపడండి.
Updated on: Jul 11, 2025 | 4:55 PM

ఛాతి నొప్పి: తరచుగా ఛాతీ నొప్పి వస్తే అదే గుండె జబ్బులను చూసిస్తుందని తెలుసుకోవాలి. వెంటనే వైద్యుని సంప్రదిస్తే సమస్య నుంచి బయట పడవచ్చు. సకాలంలో చికిత్స చేయించుకోవడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయి.

వాంతులు: ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కొన్ని సార్లు వాంతులు అవడం సర్వసాధారణం. అయితే ఛాతీ నొప్పి తర్వాత వాంతులు అయితే మాత్రం గుండె జబ్బులకు సూచన అని గుర్తించాలి. అటువంటి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గర చికిత్స తీసుకోండి.

కడుపునొప్పి: కడుపునొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. వాటిలో ప్రధాన కారణం మాత్రం ఆహారం సరిగా జీర్ణం అవకపోవడం. అయితే ఇది అధికమైతే మాత్రం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలంటి పరిస్థితిలో వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

దవడల్లో నొప్పి: తరచూ దవడలో నొప్పితో నొప్పితో బాధపడితే మాత్రం వెంటనే డాక్టర్ ని కలవండి. లేదంటే అది గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల ప్రాణాపాయం ఉండవచ్చు.

ఆకస్మికంగా చెమటలు పట్టడం: వేసవిలో, వర్కవుట్, ఏదైనా కష్టమైన పనులు చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం సహజం. అయితే ఏసీ గదిలోనో, చల్లని ప్రదేశాల్లనో ఎలాంటి శ్రమ లేకుండా ఆకస్మికంగా చెమటలు పడితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.




