దీని నుంచి బయటపడాలంటే ఆహారంలో ఐరన్, విటమిన్ B-12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. శ్వాస వ్యాయామాలు చేయడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయినా శ్వాసకోశ సమస్యను ఎదుర్కొంటుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి. యోగాసనాలు కూడా వేయవచ్చు.