ఖాళీ కడుపుతో తేనె కలిపిన నిమ్మ రసం తాగుతున్నారా? ఒక్క క్షణం ఆగండి

07 November 2024

TV9 Telugu

TV9 Telugu

రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి

TV9 Telugu

తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడి తేనె అయితే మేలు

TV9 Telugu

నిమ్మరసంలో కాస్తింత తేనె కలిపి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చు. శరీరంలోని అదనపు కొవ్వును త్వరగా పోగొట్టి బరువును అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

అందుకే త్వరగా బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నిమ్మరసంలో తేనె కలిపి తాగాలని నిపుణులు చెబుతుంటారు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగాలని ఆయుర్వేదం కూడా సిఫార్సు చేస్తోంది

TV9 Telugu

అయితే  ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదా? కాదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఖాళీ కడుపుతో తేనె కలిపిన నిమ్మరసం తాగకూడదు 

TV9 Telugu

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల మన పొట్టలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. కడుపులో కొంత మొత్తంలో యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయలో ఆమ్ల లక్షణాలు కూడా ఉంటాయి

TV9 Telugu

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎముకల సమస్యలు, దంత సమస్యలు, డీహైడ్రేషన్, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పళ్ళు తోముకుని రెండు గ్లాసుల నీళ్లు తాగి, ఆ తర్వాత నిమ్మరసం తాగాలి

TV9 Telugu

బ్రష్ చేశాక..రెండు గ్లాసుల సాధారణ నీటిని తాగాలి. ఇప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి తాగాలి. ఇలా చేస్తే శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి, అదనపు కొవ్వును తొలగించడంలో, బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది