Samantha: ప్రయోగాలకు రెడీ అంటున్న స్టార్ హీరోయిన్
తన ఫ్యూచర్ ప్లానింగ్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు స్టార్ హీరోయిన్ సమంత. ప్రజెంట్ యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయబోయేది ఫుల్ క్లారిటీ ఇచ్చారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, ఆ తరువాత కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.
Updated on: Nov 08, 2024 | 1:01 PM

తన ఫ్యూచర్ ప్లానింగ్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు స్టార్ హీరోయిన్ సమంత. ప్రజెంట్ యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయబోయేది ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

సిల్వర్ స్క్రీన్ మీద సమంతను మిస్ అవుతున్న ఫ్యాన్స్, డిజిటల్‌లో ఆమె సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1990, 2000 మధ్య కాలంలో జరిగే కథగా తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీలో సమంత ఏజెంట్ పాత్రలో నటించారు.

వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్‌లో సందడి చేస్తున్న సమంత తన ఫ్యూచర్ ప్లానింగ్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇక మీదట రొటీన్, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయనని తేల్చి చెప్పారు. దీంతో సామ్‌ను కమర్షియల్ మూవీస్‌లో స్టార్ హీరోలకు జోడీగా చూడలనుకుంటున్న ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

హాలీవుడ్ మేకర్స్ రుస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ షోకు ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

కెరీర్ విషయంలోనూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు సామ్. నటనకు ఆస్కారమున్న సబ్జెక్ట్స్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కేవలం సినిమానే అన్న రూల్ పెట్టుకోకుండా, డిజిటల్ ప్రాజెక్ట్స్‌లోనూ రెగ్యులర్‌గా నటిస్తున్నారు. ప్రజెంట్ తన ప్రీవియస్ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసిన రాజ్ డీకే కాంబినేషన్‌లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు సామ్.




