ఈ లక్షణాలు ఉంటె మీకు షుగర్ వ్యాధి ఉన్నట్లే !!

Phani CH

08 November 2024

ప్రస్తుతం ఉన్న  జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణాల వల్ల చిన్న నుండి పెద్ద వారి వరకు ఎదుర్కుంటున్న సమస్య డయాబెటిస్. ప్రస్తుతం యుక్త వయసులో ఉన్నవారికి ఎక్కువ వస్తుంది ఈ వ్యాధి.

షుగర్ వ్యాధి సోకే తొలినాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని సింప్టమ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయంటే అవి డయాబెటిస్ సంకేతాలేనని గుర్తుంచుకోవాలి. 

అయితే షుగర్ వ్యాధి సోకే తొలినాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇవి నార్మల్‌గానే అనిపించినా తరచుగా వస్తే మాత్రం డౌట్ పడాల్సిందే. 

రాత్రి 10 దాటిన తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే కిడ్నీలపై ఒత్తిడి పది బ్లాడర్ త్వరగా నిండిపోయి మెలుకువ వస్తుంది. ఒకటికి రెండుసార్లు మూత్రానికి నిద్ర లేస్తున్నారంటే డయాబెటిస్ ఉన్నట్లుగా పరిగణించాలి.

అధిక సార్లు మూత్రానికి వెళ్లడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నోరు కూడా డ్రై కావడంతో మితిమీరిన దాహం వేస్తుంది. ఇది కూడా డయాబెటిస్‌కి ఒక సంకేతం.

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే శరీరం మొద్దుబారినట్లు, శారీరక శ్రమ లేకపోయినా తీవ్ర అలసిపోయినట్లు ఉంటుంది.  ఇలాగే కొనసాగితే హెల్త్‌పై ప్రభావం చూపుతుందని గ్రహించాలి.

 ఇంట్లో ఫ్యాన్ లేదా ఏసీ ఉన్నప్పటికీ చెమటలు పడితే మాత్రం డౌట్ పడాల్సిందే. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పడిపోతే చెమటలు వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే డయాబెటిస్ సింప్టమ్‌గా పరిగణించాలి. 

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు హార్ట్‌బీట్‌లో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు వస్తాయి. మధ్య రాత్రి అసౌకర్యంగా అనిపిస్తుంది.  ఫ్రీక్వెంట్‌గా ఈ ఇబ్బంది కలుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.