- Telugu News Photo Gallery Cinema photos Samantha to Siva Karthikeyan Amaran lates film news from industry
Film Updates: అలాంటి సినిమాలకు నో అంటున్న సామ్.. అమరన్ సక్సెస్ మీట్..
అలాంటి సినిమాలకు నో అంటున్న సమంత. విక్కీ కౌషల్ హిస్టారికల్ మూవీ ఛావా విడుదల వాయిదా. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ఇంట్రస్టింగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్. అమరన్ సక్సెస్ మీట్‌లో హీరో నితిన్ క్రేజీ కామెంట్స్. అమ్మ సపోర్ట్‌తోనే అది జరిగిందన్న సీనియర్ నటి మనీషా కొయిరాల. ఇలాంటి సినిమా వార్తలు ఈరోజు మన తెలుసుకుందాం రండి..
Updated on: Nov 08, 2024 | 3:58 PM

ఇక మీద రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయనని చెప్పేశారు సమంత. ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నటనకు ఆస్కారమున్న పాత్రలు మాత్రమే చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు సామ్.

విక్కీ కౌషల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ఛావా. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. కానీ తాజాగా రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉంది మూవీ టీమ్. ఒక రోజు ముందే పుష్ప 2 రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల దొరక్కపోవచ్చన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేస్తున్నారు ఛావా మేకర్స్.

బాలీవుడ్‌లో మరో ఇంట్రస్టింగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. మేఘన గుల్జర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కరీనా కపూర్‌కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పారు. రీసెంట్‌గా హిందీలో బడేమియా చోటే మియా సినిమాలో విలన్‌గా నటించారు పృథ్వీరాజ్.

అందుకే డిజిటల్ రిలీజ్‌ను మరో రెండు వారాల పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే రీసెంట్ టైమ్స్‌లో చెప్పిన టైమ్ కన్నా ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న సినిమాగా అమరన్ నయా రికార్డ్ సెట్ చేస్తోంది.

అమ్మ సపోర్ట్‌తోనే క్యాన్సర్‌ను జయించానన్నారు సీనియర్ నటి మనీషా కొయిరాల. 2012లో క్యాన్సర్ బారిన పడిన మనీషా, ఆరు నెలల చికిత్స తరువాత కోలుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో తాను అనుభవించిన బాధను అభిమానులతో షేర్ చేసుకున్నారు.




