- Telugu News Photo Gallery Winter Season Travel India: best places for adventure activities in india know here
Winter Vacation: సాహస కార్యకలాపాలు అంటే ఇష్టమా.. శీతాకాలంలో ట్రెక్కింగ్, స్నో బైకింగ్ వంటి యాక్టివిటీస్ కోసం ఈప్రదేశాలు బెస్ట్
కొంతమందికి ప్రకృతి అందాలను చూడడం ఇష్టం అయితే.. మరికొందరికి సాహస కార్యాలు చేయడం ఇష్టం. అలా స్నో బైకింగ్ లేదా ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఇష్టపడేవారు మన దేశంలో బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీలు చేసే అవకాశం ఉన్న ఈ ప్రదేశాలను తమ స్నేహితులతో కలిసి సందర్శించడానికి చాలా మంది ఇష్టపడతారు. భారతదేశంలో మీరు రాఫ్టింగ్, జిప్‌లైన్, పారాగ్లైడింగ్, స్కీయింగ్ వంటి అనేక ఇతర సాహస కార్యకలాపాలు చేసే అవకాశం ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
Updated on: Nov 08, 2024 | 12:17 PM

చాలా మందికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. మరి కొందరికి సాహస కార్యకలాపాలు చేయడం అంటే ఇష్టం. అయితే ఇలాంటి ప్రయాణాలు.. ట్రిప్ లుగా మాత్రమే కాదు.. విభిన్నమైన అనుభవం.. చిరస్మరణీయ క్షణాలుగా ఎప్పుడూ గుర్తుండిపోతాయి. సాహస కార్యకలాపాలు ట్రెక్కింగ్, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్ వంటివి మరెన్నో ఉన్నాయి. చాలా మంది తమ స్నేహితులతో కలిసి అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. తద్వారా వారు అక్కడ అనేక ప్రదేశాలను చూడడానికి.. అనేక సాహస కార్యకలాపాలన్నీ చేయడానికి అవకాశం పొందుతారు. భారతదేశంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీకు కూడా డిఫరెంట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లవచ్చు.

రిషికేశ్: ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం రిషికేశ్ వెళ్ళవచ్చు. ఇక్కడ బైకింగ్, రివర్ రాఫ్టింగ్, వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ వంటి సాహస కార్యకలాపాలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య వరకూ మాత్రమే కాదు.. మార్చి నుంచి మే వరకు రిషికేశ్ రివర్ రాఫ్టింగ్‌కు అనువైన సమయం. అంతేకాదు ఇక్కడ సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతిలో ప్రశాంతంగా గడపడానికి ఏ సీజన్‌లోనైనా ఇక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.

బీర్ బిల్లింగ్: హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్ సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ వేసవి కాలంలో బిర్ బిల్లింగ్‌ని సందర్శించి, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, ట్రెక్కింగ్, హ్యాంగ్ గ్లైడింగ్, మౌంటెన్ బైకింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రదేశం ధర్మశాల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో.. మనాలి నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నైనిటాల్: ప్రయాణం చేయడంతో పాటు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం అంటే ఇష్టం ఉంటే.. సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందిన నైనిటాల్‌కు కూడా వెళ్లవచ్చు. మీరు ఇక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాంగోట్‌లో క్యాంపింగ్ ట్రిప్ చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్, డబుల్ రోగ్, బర్మా బ్రిడ్జ్, రాపెల్లింగ్, టార్జాన్ స్వింగ్ వంటి అనేక కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. నైనిటాల్‌లోని అనేక ప్రదేశాలలో పారాగ్లైడింగ్, రిడ్జ్ క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, పారాసైలింగ్, గుర్రపు స్వారీ, వాచర్ జోర్బింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలు చేసే ఎంజాయ్ చేయవచ్చు.

మనాలి: చాలా మంది సందర్శనల కోసం మనాలికి వెళతారు. అయితే దీనితో పాటు ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇక్కడ వాటర్ రాఫ్టింగ్, జిప్‌లైన్, పారాగ్లైడింగ్, స్కీయింగ్, స్నో బోర్డింగ్, ట్రెక్కింగ్ వంటి అనేక కార్యకలాపాలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. హిమపాతం, శీతాకాలపు క్రీడలను ఆస్వాదించాలనుకుంటే ఇక్కడ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలలలో సందర్శించడానికి ఉత్తమ సమయం. అంతేకాదు మనాలిలో వేసవి కాలంలో పువ్వులు, పచ్చదనం చూడవచ్చు.




