బ్రోకలీ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

Phani CH

08 November 2024

మీరు ఈ ఆకుపచ్చ క్యాబేజీని ఎప్పుడైనా చూసారా ?? ఇది చూడటానికి తెల్ల క్యాబేజిని పోలి ఉంటుంది. దీన్ని బ్రోకలీ అంటారు.

ఈ మధ్య కాలంలో యువత ఈ బ్రోకలీని ఎక్కువగా తింటున్నారు. అయితే దీని వల్ల అనేక ఆర్యోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బ్రోకలీ వైట్ క్యాబేజి కన్న ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

ఎక్కువ ఆకుపచ్చని కూరగాయాలు తినేవారికి మెదడు మంచి చురుకుగా పనిచేస్తుందట. దీన్ని తగిన పరిమాణంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ నివారించబడుతాయి.

బ్రోకలీ లో రోగనిరోధక శక్తిని పెంచే జింక్, సెలీనియం, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. మీరు బ్రోకలీని కూరగాయలు, సూప్ లేదా సలాడ్‌గా ఉపయోగించవచ్చు.

బ్రోకలీలో పాలీఫెనాల్, క్వెర్సెటిన్ మరియు గ్లూకోసైడ్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి.

బ్రోకలీ ఫైబర్, పొటాషియం, ప్రోటీన్లకు మంచి మూలం. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గడానికి, ఖచ్చితంగా బ్రోకలీ సలాడ్ లేదా సూప్ తాగండి.

బ్రకోలీ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్, హెపాటోప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి.

ఎముకలను బలోపేతం చేయడానికి బ్రొకోలి ఎంతగానో ఉపయోగపడుతుంది.. బ్రోకలీలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది.