- Telugu News Photo Gallery Say goodbye to Chikungunya with these homemade tips, Check Here is Details
Chikungunya: ఈ ఇంటి చిట్కాలతో చికెన్ గున్యాకి బైబై చెప్పేయండి..
ఈ మధ్య కాలంలో చాలా మంది చికెన్ గున్యాతో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి తీవ్రతను తట్టుకోలేని వారు మరణిస్తున్నారు. కాబట్టి చికెన్ గున్యా లక్షణాలు కనిపించగానే వైద్యుల్ని సంప్రదించాలి. చికిత్సతో పాటు ఆరోగ్యకమైన ఆహారాన్ని తీసుకోవాలి..
Updated on: Nov 08, 2024 | 1:04 PM

ప్రస్తుత కాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే జ్వరాల్లో చికెన్ గున్యా ఒకటి. చికెన్ గున్యా వచ్చిందంటే కనీసం నడవలేని పరిస్థితి నెలకొంటుంది. ఒక వ్యక్త సహాయంతోనే నడవాలి. ఒళ్లంతా నొప్పులతో.. నీరసంగా ఉంటారు. కీళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి.

చికెన్ గున్యా కారణంగా రోగ నిరోధక శక్తి పూర్తిగా లోపిస్తుంది. ఏ పనీ చేయలేరు. తినేందుకు కూడా వ్యక్తి సహాయం కావాలి. చికెన్ గున్యా నుంచి త్వరగా కోలుకోవాలంటే మందులతో పాటు ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి.

వేప ఆకులు వేసిన గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. వేపాకులు లేకపోతే తులసి ఆకులు అయినా వాడవచ్చు. కొద్దిగా ఉప్పు వేసి స్నానం చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆ తర్వాత లవంగాల నూనెతో మర్దనా చేస్తే రిలీఫ్గా ఉంటుంది.

ఆహారం తినబుద్ధి కాకపోయినా పళ్ల రసాలు, పండ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. ఉడక బెట్టిన గుడ్లు, బెల్లంతో చేసిన వంటలు తినాలి. విటమిన్ డి, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తినాలి.

వైద్యుల సలహా మేరకు పన్నీర్, రాగి జావ, మజ్జిగ, పాలు తీసుకుంటూ ఉండాలి. వీటిల్లో మంచి పోషకాలు లభిస్తాయి. కాబట్టి తర్వగా చికెన్ గున్యా నుంచి కోలుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శక్తి వస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )




