- Telugu News Photo Gallery Cricket photos DC Former coaching staff mohammad kaif revealed why prithi shaw remain unsold
Prithvi Shaw: ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?
IPL 2025 మెగా వేలంలో పృథ్వీ షాను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఢిల్లీ మాజీ కోచింగ్ సిబ్బంది షా ఎందుకు అమ్ముడుపోకుండా ఉండిపోయారో వివరించారు.
Updated on: Nov 27, 2024 | 5:00 AM

పృథ్వీ షా చాలా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు. పిన్న వయస్సులోనే టీమ్ ఇండియాలో చేరాడు. ఒకప్పుడు, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మరియు బ్రియాన్ లారా వంటి దిగ్గజాల సరసన పృథ్వీ షాను కీర్తించారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో షా తన బేస్ ధరను రూ.75 లక్షలుగా ఉంచాడు. ఏదో ఒక టీమ్ అతడిని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని అనుకున్నా అది జరగలేదు.

ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలంలో షా అమ్మబడకపోవడానికి మహ్మద్ కైఫ్ కారణాన్ని చెప్పాడు. కైఫ్ ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉండేవాడు.

షా గురించి కైఫ్ మాట్లాడుతూ, "ఒకప్పుడు పృథ్వీ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ చాలా కఠినంగా వ్యవహరించింది. షాను జట్టు నుండి తప్పించడం గురించి కూడా చర్చ జరిగింది, అయితే మ్యాచ్‌కు ముందు, కోచ్ రికీ పాంటింగ్ నేటి జట్టులో పృథ్వీ అత్యుత్తమమని భావించాడు"

"కానీ పృథ్వీ తన ఆటను మెరుగుపరచుకోలేకపోయాడు. షాకు బాగా ఆడే సామర్థ్యం లేదని కాదు, కానీ అతను తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేకపోయాడు" అని కైఫ్ చెప్పుకొచ్చాడు.




