- Telugu News Photo Gallery Cinema photos Tollywood's Friday treat, interesting movies that entertain the audience
Release Day: టాలీవుడ్ ఫ్రైడే ట్రీట్.. అలరిస్తున్న ఇంట్రస్టింగ్ సినిమాలు..
మళ్లీ ఫ్రైడే వచ్చేసింది. ఈ వారం ఇంట్రస్టింగ్ సినిమాలే టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఒక ఇనెమ ఈ మధ్యనే కాంట్రవర్శీలో నిలిచింది. ఇంకో మూవీకి స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాత. మరొకటి మెగాస్టార్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్... మరి వీటి సంగతులు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: May 09, 2025 | 11:50 AM

సమంత శుభం మూవీకి సంబంధించి ప్రీమియర్స్ బాగానే పడుతున్నాయి. సీరియల్స్ నీ, హారర్ ఎలిమెంట్‌నీ, కామెడీని ముడిపెట్టి చేసిన సినిమా కాబట్టి ఈ సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నారు సినీ జనాలు.

అటు శ్రీవిష్ణు నటించిన సింగిల్ ప్రమోషనల్ కంటెంట్‌తోనే వైరల్ అయింది. మంచు కురిసిపోతుంది డైలాగ్‌తోనే బోలెడంత అటెన్షన్ తెచ్చేసుకుంది ఈ సినిమా. ఇది కాంట్రవర్శీకి దారి తీసింది. అయనప్పటికీ ఈ మూవీ జోరు ఆగలేదు.

ఇందులో శ్రీవిష్ణుకి ఇవానా, కేతిక హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ టైమ్ ప్రాపర్ లవ్ స్టోరీ చేశానన్నారు శ్రీవిష్ణు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే శ్రీవిష్ణు ఈ సారి ఏం ప్లాన్ చేశారోనని ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు.

ఆ ఉంగరం ఏమైంది? ఆ చేప ఏమైంది? అంటూ రామ్‌చరణ్ అడిగిన ప్రశ్నలు జగదేక వీరుడు అతిలోక సుందరి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాయి ప్రేక్షకుల్ని. ఈ సమ్మర్‌లో మెగా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. క్వాలిటీ వెర్షన్ రిలీజ్ చేయడానికి మేకర్స్ చేసిన కృషిని ప్రశంసిస్తున్నారు మూవీ గోయర్స్.

జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ అయినప్పట్టికీ.. కొత్త సినిమాలనే ప్రోమోట్ చేస్తున్నారు మేకర్స్. సుమతో కలిసి చిరు, అశ్విని దత్, రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసారు. ఈ సినిమాకి బుకింగ్స్ కూడా భారీగానే ఉన్నాయి.




