- Telugu News Photo Gallery Cinema photos Rajamouli's Mahabharata and Aamir Khan's Mahabharata, which one will go on the sets first?
Mahabharatham: రాజమౌళి భారతం.. ఆమిర్ భారతం.. ముందు సెట్స్‌పైకి వెళ్ళేది ఏది.?
ఆదిపురుష్, నార్త్ రామాయణం అంటూ రీసెంట్ టైమ్స్ లో రామాయణం థీమ్‌తో రెండు భారీ ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు మహాభారతం కూడా ఇలాగే సౌత్, నార్త్ అంటూ రెండు ప్రాజెక్టులుగా కనిపించనుందా? ఆమిర్ భారతం, రాజమౌళి భారతం.. రెండిటిలో ఏది ముందు సెట్స్ మీదకు వెళ్తుంది?
Updated on: May 09, 2025 | 12:25 PM

కమర్షియల్ ప్రాజెక్టులతో కంటిన్యూ అవుతున్న ఆమిర్.. భారతం గురించి మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. భారతంలో కృష్ణుడి కేరక్టర్ చేస్తానంటూ రీసెంట్‌గా కమిట్ అయ్యారు. ఈ టైమ్‌లోనే ఆమిర్‌ని అతనింట్లో కలిశారు అల్లు అర్జున్. సో.. భారతంలో ఐకాన్‌స్టార్‌కి ఏ కేరక్టర్ అంటూ రూమర్లు స్టార్ట్ అయ్యాయి.

నార్త్ భారతంలో ఆమిర్ కృష్ణుడైతే, రాజమౌళి భారతంలో కృష్ణుడు ఎవరు? అనే టాపిక్ కూడా సైడ్ బై సైడ్ షురూ అయింది. నేచురల్ స్టార్ తప్పకుండా భారతంలో ఉంటారని ఆల్రెడీ చెప్పేశారు జక్కన్న.

మరి జక్కన్న భారతంలో కృష్ణుడెవరు? అర్జునుడెవరు? కర్ణుడెవరు? తారక్, రామ్‌చరణ్, ప్రభాస్.. వీళ్లల్లో ఎవరెవరు ఏ కేరక్టర్లు పంచుకుంటారు? అనే డిస్కషన్ గట్టిగానే జరుగుతోంది. ఇవాళో, రేపో మొదలయ్యే ప్రాజెక్ట్ కాకపోయినా చర్చ మాత్రం స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.

ఆలస్యమైందా ఆచార్యపుత్రా అంటూ కల్కిలో కర్ణుడి కేరక్టర్‌లో ప్రభాస్ కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండింది. ఈ సినిమా 11 కోట్లకుపైగా వసూళ్లు చేసి 2024లో తొలి 1000 కోట్లు కొల్లగొట్టిన పాన్ ఇండియా సినిమాగా నిలిచింది.

ఇందులో అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూసుకుని మురిసిపోయారు జనాలు. ఒకే కేరక్టర్‌కి అక్కడొకరూ.. ఇక్కడొకరూ ఎందుకు?.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఆమిర్, రాజమౌళి కలిసి ఒకే భారతాన్ని తెరకెక్కిస్తే... వరల్డ్ వైడ్ ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసే ప్రాజెక్ట్ తయారు చేయొచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.




