- Telugu News Photo Gallery Cinema photos Telugu Heroines like Shruti Haasan Mrunal Thakur Open up about their Marriage
పెళ్లి గురించి ఓపెన్ అయిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు
ఒకప్పుడు అంటే పెళ్లి గురించి మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవాళ్లు మన హీరోయిన్లు. కానీ ఇప్పుడలా కాదు.. మనసులో ఉన్నదున్నట్లు బయటికి చెప్పేస్తున్నారు. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే పెళ్లి గురించి ఓపెన్ అయిపోయారు.. ఇందులో ఒకరు శ్రీమతి అయ్యేందుకు సిద్ధంగా ఉంటే.. ఇంకొకరు ఎప్పటికీ కానంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు..?
Updated on: Jul 28, 2025 | 9:36 PM

ఇండస్ట్రీలో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుందిప్పుడు.. పైగా ఒకప్పట్లా పెళ్లైతే హీరోయిన్లకు అవకాశాలు రావు అనే భయం కూడా లేదిప్పుడు. కియారా అద్వానీ, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ హాయిగా పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు.

అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాలంటున్నారు మన హీరోయిన్లు. పెళ్లి గురించి ఇండస్ట్రీలో మరో ఇద్దరు హీరోయిన్లు ఓపెన్ అయ్యారిప్పుడు. అందులో శృతి హాసన్ ఒపీనియన్ చాలా విభిన్నంగా ఉంది.

ఎంతైనా కమల్ హాసన్ కూతురు కదా.. కాస్త విలక్షణంగానే ఆలోచిస్తుంది ఈ బ్యూటీ. పెళ్లి తన కప్ ఆఫ్ టీ కాదంటున్నారు శృతి. రిలేషన్ ఎంజాయ్ చేస్తాను కానీ మ్యారేజ్ మాత్రం తనకు సెట్ అవ్వదంటున్నారు ఈ బ్యూటీ.

ఇప్పటికే మూడు సీరియస్ రిలేషన్ షిప్స్‌లో ఉన్నారు శృతి హాసన్. కొన్నేళ్లుగా శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. తనకు రిలేషన్ వరకు ఓకే గానీ.. పెళ్ళి అంటే భయమని.. మధ్యలో వదిలేస్తే తాను ఆ బాధ భరించలేనంటున్నారు ఈ భామ. అందుకే పెళ్లికి మాత్రం నో అంటున్నారు శృతి హాసన్.

పెళ్లిపై మృణాళ్ ఠాకూర్ వర్షన్ మరోలా ఉంది. తనకు త్వరగా అమ్మ అవ్వాలని ఉందని.. పిల్లలతో లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. పెళ్ళి, పిల్లలు.. ఓ మంచి జీవితం అంటున్నారు ఈ బ్యూటీ. కాకపోతే పెళ్లి ఇప్పట్లో ఉండదని.. ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నానన్నారు మృణాళ్. మొత్తానికి మన హీరోయిన్లకు పెళ్లిపై ఒక్కొక్కరికీ ఒక్కో ఒపీనియన్ ఉందన్నమాట.




