- Telugu News Photo Gallery Cinema photos Telugu Blockbuster Court Gets Tamil Remake Cast, Release Date and More
తమిళంలోకి వెళ్తున్న సెన్సేషనల్ తెలుగు సినిమా
తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? మన సినిమాలను ప్రపంచమంతా చూస్తుంది. అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నా కూడా రీమేక్స్ కూడా అవుతున్నాయి. తాజాగా మరో సెన్సేషనల్ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన చిన్న సినిమా తమిళంలోకి వెళ్తుందిప్పుడు. మరి అదేంటి..?
Updated on: Jul 28, 2025 | 9:47 PM

2025లో విడుదలైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ముందుండేది కోర్ట్. నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన కోర్ట్ సినిమా సంచలన విజయం సాధించింది.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా కనిపించారు. కోర్ట్ సినిమాకు కలెక్షన్లు మాత్రమే కాదు.. ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి.

పోక్సో చట్టం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నారు దర్శకుడు రామ్ జగదీష్. ఈ పాయింట్ బాగా డీల్ చేయడంతో కోర్ట్ సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా ఓటిటిలో అన్ని భాషల్లో అందుబాటులో ఉంది.

ఇలాంటి సమయంలో దీన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారిప్పుడు. కోర్ట్ తమిళ హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

జీన్స్ ఫేమ్ ప్రశాంత్ కీలక పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో కృతిక్, ఇనియా జంటగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ ఈ మధ్య జులాయి, అంధాధూన్ లాంటి రీమేక్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు కోర్ట్ రీమేక్ వైపు అడుగులేస్తున్నారు.




