- Telugu News Photo Gallery Cinema photos SSMB29 Rajamouli's Next Schedule, Mahesh Babu's Break and Film Updates
SSMB29: మహేష్ ఫ్యాన్స్ కు పెద్ద ఝలక్.. లాంగ్ బ్రేక్ తప్పదంటున్న జక్కన్న
SSMB29 సినిమాకు మరోసారి లాంగ్ బ్రేక్ తప్పట్లేదా..? సమ్మర్‌లో టీంకు దాదాపు 40 రోజులు హాలీడేస్ ఇచ్చిన రాజమౌళి.. మరోసారి అలాంటిదే చేయబోతున్నారా..? కాకపోతే ఈ సారి కండీషన్స్ అప్లై అంటున్నారా..? అసలు మహేష్, జక్కన్న సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది..? నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..?
Updated on: Aug 04, 2025 | 9:29 PM

మహేష్ అభిమానులు ప్రస్తుతం అతడు మత్తులో ఉన్నారు. మొన్నటి వరకు ఖలేజా సినిమా రీ రిలీజ్ ఎంజాయ్ చేసిన వాళ్లు.. ఇప్పుడు అతడు మాయలో ఉన్నారు. రాజమౌళి ఇచ్చినపుడు ఇస్తారులే అని వాళ్ల ఆనందాన్ని వాళ్లే వెతుక్కుంటున్నారు.

ఈసారి మహేష్ పుట్టిన రోజును అతడు సినిమాతో సెలెబ్రేట్ చేయాలని చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటేనే హీరోలు మూడు నాలుగేళ్లు లాక్ అయిపోవడం అని అర్థం.

అందుకే SSMB29 నుంచి అప్డేట్స్ పెద్దగా ఆశించట్లేదు ఫ్యాన్స్.. వచ్చినపుడు చూసుకుందాం అనుకుంటున్నారు. మరోవైపు SSMB29 షూట్‌కు రాజమౌళి చిన్న బ్రేక్ ఇస్తున్నారని తెలుస్తుంది.

ఆగస్ట్ అంతా నెక్ట్స్ షెడ్యూల్స్ కోసం ప్రిపరేషన్ నడుస్తుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. నెక్ట్స్ షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ముందు కెన్యాలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినా.. ఇప్పుడది ఆఫ్రికాకు మార్చారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్‌తో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఆగస్ట్ 9న బర్త్ డే ఉండటంతో.. ఈలోపు మహేష్ కూడా చిన్న వెకేషన్ వెళ్లొచ్చే అవకాశం లేకపోలేదు.




