- Telugu News Photo Gallery Cinema photos OG First Single Out Pawan Kalyan's Stylish Mafia Look Impresses Fans
OG: పవన్ తుఫాన్ వార్నింగ్..ఓజి సాంగ్ ట్రెండింగ్..
పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.. వాళ్లు కళ్లలో ఒత్తులేసుకుని మరీ వేచి చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మరి అదెలా ఉంది..? ఎప్పట్నుంచో ఈ పాట గురించి ఊరిస్తున్న తమన్.. అంచనాలు అందుకున్నారా..? ఓజి తొలి పాటలో మేజర్ హైలైట్స్ ఏంటి..? రిలీజ్ డేట్ మళ్లీ కన్ఫర్మ్ చేసారా..?
Updated on: Aug 04, 2025 | 9:39 PM

హరిహర వీరమల్లు సినిమా పవన్ అభిమానుల ఆకలి తీర్చలేకపోయింది. ఆయన్ని రెండేళ్ళ తర్వాత స్క్రీన్ మీద చూసామనే సంతృప్తిని తప్పిస్తే.. వాళ్లు కోరుకున్న పవర్ స్టార్‌ను స్క్రీన్ మీద చూపించలేకపోయింది హరిహర వీరమల్లు. ఆ లోటు ఇప్పుడు ఓజితో తీరిపోతుందని బలంగా నమ్ముతున్నారు వాళ్లు.. తాజాగా ఓజి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

చాలా ఏళ్లుగా పవన్‌ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని కలలు కంటున్నారో.. అచ్చంగా అలాగే చూపించారు దర్శకుడు సుజీత్. థమన్ స్వరపరిచిన పాటలో స్టైలిష్ పవన్ కనిపించారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామా ఇది. గన్స్, మాఫియా చుట్టూ తిరిగే కథ ఇది.

సౌండ్ డిజైనింగ్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఓజాస్ గంభీర అంటూ సాగే ఈ పాటలో పవన్ లుక్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

సినిమా సెప్టెంబర్ 25న రాబోతున్నట్లు మరోసారి ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత పవన్ నటిస్తున్న పూర్తిస్థాయి మాఫియా డ్రామా ఇది. చివరగా పంజాలో మాఫియా గెటప్‌లో కనిపించారు.

డే 1 నుంచే ఓజిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.. పవన్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ కూడా అడిగింది ఓజి కోసమే. ఇంత ప్రెజర్ ఉన్నా.. చాలా కామ్‌గా తన పని తాను చేసుకుంటున్నారు సుజీత్. ఓజిలో పవన్ లుక్స్ మేజర్ హైలైట్.. తొలిప్రేమ, తమ్ముడు లుక్స్ గుర్తు చేస్తున్నారు పవర్ స్టార్. మొత్తానికి ఓజితో బాక్సాఫీస్‌కు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసారు పవర్ స్టార్.




