- Telugu News Photo Gallery Cinema photos Hansika Motwani Divorce rumours with husband Sohael Khaturiya after she removes wedding photos from her Instagram
విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఫోటోలు డిలీట్ చేసిన బ్యూటీ
నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.
Updated on: Aug 05, 2025 | 1:31 PM

నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో జంట కూడా విడిపోతున్నారని తెలుస్తుంది.

నిన్నటి వరకు లవబుల్ కపుల్ గా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిడిపోతున్నారని వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది ఈ క్రేజీ బ్యూటీ. భర్తతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించింది ఆమె. దాంతో ఇద్దరూ విడిపోవడం ఖాయం అంటున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే..

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులను పలకరించింది హన్సిక . తొలి సినిమాతోనే మంది విజయాన్ని అందుకుంది ఆతర్వాత కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది.

హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో రాజస్థాన్ జైపూర్‌లో వివాహం జరిగింది. సొహైల్ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. అయితే ఇప్పుడు ఏ జంట విడిపోతున్నారని తెలుస్తుంది. విడాకుల రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో హన్సిక భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించింది.




