పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ శ్రీలీల. మొదటి సినిమాతోనే సెన్సెషన్ సృష్టించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత వెంటనే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో దాదాపు అరడజనుకు పైగా చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది. కానీ ఈ బ్యూటీకి వరుసగా ప్లాప్స్ రావడంతో కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.